• Skip to Content
  • Sitemap
  • Advance Search

 

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్

(అత్యవసర వైద్య సహాయం)

 

నోవెల్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19)

 

ప్రజలచే మాస్క్ వాడకంపై మార్గదర్శకాలు

1.         పరిచయం :

నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) పేరుతో ఒక కొత్త వ్యాధి 2019 డిసెంబర్ ప్రారంభంలో చైనాలో ఉద్భవించింది. అది ఇప్పుడు 90 కి పైగా దేశాలకు విస్తరించింది.   2020 మార్చి 9 తేదీ నాటికి భారతదేశంలో 42 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా వ్యాధి సోకిన దేశాల నుండి ప్రయాణించినవారే ఉన్నారు.   జ్వరం మరియు లేదా దగ్గు లక్షణాలతో ఇది ఎక్కువమంది రోగులలో స్వల్ప అనారోగ్యానికి కారణమౌతోంది. వీరిలో చాలా తక్కువ మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి వ్యాధి తీవ్రమౌతోంది.   కోవిడ్ దగ్గుతో బాధపడుతున్న వ్యక్తి ద్వారా, అతని దగ్గు వల్ల నోటి నుండి బయటకు వచ్చే నీటి తుంపర్లద్వారా, అతనికి ఒక మీటరు కంటే తక్కువ దూరంలో ఉన్న ఇతరులకు ఇది వ్యాపిస్తుందిదగ్గుతో సంబంధం ఉన్న అటువంటి కొత్త వ్యాధి ఏదైనా, వివిధ ప్రాంతాలనుండి సూచనలు, సలహాలకు ముఖ్యంగా సామాజిక మాధ్యమం ద్వారా దారితీస్తుందివ్యాధి నియంత్రణకు సాధారణ ప్రజలు మాస్క్ ఉపయోగించాలి

2.         పత్రం యొక్క ఉద్దేశ్యం :

మాస్క్ వాడకం పై సాధారణ ప్రజలకు ప్రామాణికమైన సమాచారం అందజేయడం పత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

3.         వైద్య పరమైన మాస్క్ లు :

వివిధ పరిమాణాల్లో, వివిధ ఆకారాల్లో వైద్య పరమైన మాస్కులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.   ముక్కు, నోటిని కప్పి ఉంచే విధంగా తల వెనుక కట్టుకోడానికి వీలుగా పట్టీలు/ సాగే తాడులు కలిగి ఉండి, నేసిన వస్త్రంతో చదునుగా తయారుచేసినవే సాధారణంగా వాడుకలో ఉన్నాయివీటితో పాటు శంఖాకారం లేదా బాతు ముక్కు ఆకారం లో మాస్కులు, కావాటాలతోనూ లేదా కవాటాలు లేకుండా ముక్కు, నోటిని కప్పి ఉంచి, ముఖం ఆకారానికి సరిపోయే విధంగా కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.

4.         సాధారణ ప్రజలచే మాస్కుల వాడకం :

4.1.      వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులు ఎటువంటి మాస్కులు వాడకూడదు :

ఎటువంటి వ్యాధి లక్షణాలు లేని ఆరోగ్యవంతులైన వ్యక్తులు వైద్య పరమైన మాస్కులు వాడకూడదు. ఎందుకంటేఇది భద్రతకు సంబంధించి తప్పుడు సంకేతాలను ఇచ్చే ప్రమాదముంది. తద్వారా వారు చేతులు కడుక్కోవడం వంటి ఇతర ముఖ్యమైన జాగ్రత్తలను అలక్ష్యం చేసే అవకాశముంది.   దీనికి తోడు, సమాజంలోని ఆరోగ్యవంతులైన వ్యక్తులు మాస్కులు ఉపయోగించడం వల్ల వారికి ఆరోగ్యపరమైన ప్రయోజనం చేకూరుతుంది అనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.   వాస్తవానికి, మాస్కులు తప్పుగా వినియోగించడం లేదా మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోడానికి వీలులేని మాస్కులను ఆరు గంటల కంటే ఎక్కువసేపు తీయకుండా ఉంచుకోవడం, ఒకే మాస్కును అనేక సార్లు ఉపయోగించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.   వీటి వల్ల అనవసరమైన ఖర్చు పెరుగుతుంది.

అటువంటి పరిస్థితుల్లోఅనుసరించవలసిన సమర్ధవంతమైన చర్యలు :

i.      తరచుగా చేతులను సబ్బుతోనూ, నీళ్లతోనూ 40 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలి.   70 శాతం ఆల్కహాల్ తో ఉన్న ఆల్కహాల్ ఆధారిత శానిటైజెర్ తో 20 నిముషాల సేపు చేతులు శుభ్రం చేసుకోవాలిచేతులు మురికిగా లేదా దుమ్ముతో ఉంటే, ఆల్కహాల్ ఆధారిత శానిటైజెర్ వాడవద్దు. అయితే, సబ్బు తోనూ, నీటితోనూ చేతులు శుభ్రం చేసుకోవాలి.

ii.       దగ్గే టప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కుకు, నోటికి జేబురుమాలు లేదా టిష్యు పేపర్ అడ్డం పెట్టుకోవాలిటిష్యు పేపర్ ఉపయోగించిన వెంటనే చెత్త బుట్టలో పారవేసి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.   జేబురుమాలు లేదా టిష్యు పేపర్ అందుబాటులో లేనప్పుడు చేతిని మడతపెట్టి మోచేతిని నోటికి అడ్డంగా పెట్టుకుని దగ్గాలి.

iii.       ముఖాన్నీ, నోటినీ, కళ్ళనూ చేతులతో తాకకూడదు.

iv.        దగ్గుతున్నవాళ్ళకీ, తుమ్ముతున్నవాళ్ళకీ కనీసం ఒక మీటరు దూరంలో ఉండండి.

v.         మీ శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.

4.2.      వైద్య పరమైన మాస్కులను ఎవరు, ఎప్పుడు ఉపయోగించాలి (ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు మినహా)

4.2.1.    ఒక వ్యక్తి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు :

అనారోగ్యంతో ఉన్నప్పుడు, మూడు పొరల వైద్య పరమైన మాస్కులు ఉపయోగిస్తే, మీకు సోకిన వైరస్ ఇతరులకు విస్తరించకుండా  అరికట్టవచ్చుఅయితేఇతరులకు వైరస్ వ్యాపించకుండా నిరోధించడం కోసం, తరచుగా మీ చేతులు శుభ్రంగా కడుక్కోవలసిన అవసరం కూడా ఉంది.

4.2.2.   ఆరోగ్య పరిరక్షణ సదుపాయం ఉన్న ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు :

4.2.3.      అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మీ పర్యవేక్షణలో ఉన్నప్పుడు :

4.2.4.      వైరస్ సోకినట్టు అనుమానం కలిగిన లేదా ధృవీకరించబడి, వ్యక్తి గృహ సంరక్షణలో కొనసాగుతున్నప్పుడు, వ్యక్తితో మీకు సన్నిహిత కుటుంబ సంబంధాలు కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మీరు తప్పకుండా మూడు పొరల వైద్య పరమైన మాస్క్ ను ఉపయోగించాలి.  

4.3.      వైద్యపరమైన మాస్క్  ఎంతకాలం సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది

వైద్యపరమైన మాస్క్ సక్రమంగా ఉపయోగిస్తే 8 గంటలపాటు సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది. అయితే, మధ్యలో అది తడిసినట్లైతే, దానిని వెంటనే మార్చవలసి ఉంటుంది.

4.4.      మూడు పొరల మాస్క్ ను సక్రమంగా ఉపయోగించే విధానం :

వైద్యపరమైన మాస్క్ ధరించేటప్పుడు, దిగువ తెలియజేసిన విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది విధానాన్ని మీరు అనుసరించకపోతే, మాస్క్ ద్వారానే మీకు వైరస్ సొకే ప్రమాదముంది

అనుసరించవలసిన విధానం :

•    మడతలను విప్పి, మడతలు కిందకు ఉండే విధంగా పట్టుకోవాలి.

•     మీ ముక్కు, నోరు, గడ్డం పై దాన్ని పెట్టాలి.

•      మాస్క్ పై భాగంలో సులభంగా వంచడానికి అనువుగా ఉండే ముక్కు పట్టీ (సులువుగా గుర్తించగలిగే లోహపు పట్టీ) ని ముక్కు పైన అమర్చుకోవాలి.

•        తాళ్లతో మాస్క్ ను కట్టాలి. ( పైన ఉండే తాడును చెవుల పైనుండి తీసి తల వెనుక కట్టాలి - కింద వైపున ఉండే తాడును మెడ వెనుక భాగంలో కట్టాలి.)

•        మాస్క్ రెండు వైపులా ఖాళీలు లేకుండా నిర్ధారించుకుని, ముఖానికి దగ్గరగా ఉండేవిధంగా సవరించుకోవాలి.

•         మాస్క్ ను ధరించినప్పుడు, దానిని ముట్టుకోకూడదు.

•          మాస్క్ మెడ నుండి వ్రేళ్లాడకుండా చూసుకోవాలి.

•         మాస్క్ ధరించిన ఆరు గంటల అనంతరం లేదా అది తడిసిన వెంటనే వేరొక మాస్క్ ను ధరించాలి.

•         ఒక సారి మాత్రమే ఉపయోగించడానికి వీలున్న మాస్క్ లను తిరిగి ఉపయోగించకూడదు. వాటిని పారవేయాలి.

•         మాస్క్ ను తీసేటప్పుడు, కలుషితమైన మాస్క్ ఉపరితలాన్ని చేతితో తాకకుండా, అత్యంత జాగ్రత్త వహించాలి

•         మాస్క్ తొలగించేటప్పుడు, ముందుగా మాస్క్ క్రింది తాళ్లను విప్పి, తర్వాత పైన ఉన్న తాళ్లను విప్పి, వాటిని పట్టుకుని మాస్క్ ను బయట పడవేయాలి.

4.5.       ఉపయోగించిన మాస్కులను పారవేయాలి :

ఉపయోగించిన మాస్కులను వైరస్ సోకిన మాస్కులుగా పరిగణించాలి.   రోగులు / వారి పరిరక్షకులు / గృహ పర్యవేక్షణలో వారితో సంబంధం ఉన్న వారు ఉపయోగించిన మాస్కులను సాధారణ 5 శాతం బ్లీచింగ్ ద్రావణం లేదా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించి  శుభ్రం చేసి తర్వాత వాటిని దహనం చెయ్యాలి లేదా లోతుగా గొయ్యి తీసి పాతిపెట్టాలి

***

Link mygov.in