మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నమో ఘాట్‌లో తిరుక్కురళ్ ఆధారిత పోటీల్లో పాల్గొన్న 100 మందికి పైగా విద్యార్థులు

కాశీ తమిళ సంగమం 5.0లో భాగంగా పాఠశాల విద్యార్థులకు కథా వచనం, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు

నవంబర్ 30 నుంచి వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యలోని పాఠశాల విద్యార్థులకు తిరుక్కురళ్ బోధించనున్న తమిళనాడుకు చెందిన 50 మంది ఉపాధ్యాయులు

నాడు పోస్టు చేయడమైనది: 29 NOV 2026 7:47PM by PIB Hyderabad

కాశీ తమిళ సంగమం 5.0 (KTS 5.0)లో భాగంగా ఈరోజు నమో ఘాట్‌లో కథా వచనం, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT), ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

 

కాశీ తమిళ సంగమం ఐదో ఎడిషన్ ఇతివృత్తమైన ‘తిరుక్కురళ్ పయిల్వోమ్ – తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్’ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కథా వచన పోటీలో తిరుక్కురళ్ స్ఫూర్తితో రూపొందించిన కథలను విద్యార్థులు ప్రదర్శించారు. నైతికత, సత్ప్రవర్తన, జ్ఞానం, కరుణ, మానవత్వం వంటి విలువలను ఈ కథలు ప్రతిబింబించాయి. చిత్రలేఖన పోటీలో విద్యార్థులు తమ కళాఖండాల ద్వారా ఈ సాహిత్య రచనలోని భావాలు, సందేశాలను చిత్రీకరించారు. క్విజ్ పోటీలో తిరుక్కురళ్, దాని బోధనలపై విద్యార్థుల అవగాహనను పరీక్షించారు.

నేషనల్ బుక్ ట్రస్ట్ తన సాహిత్య, విద్యా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఒక పరిచయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. 7,000కు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచిన డిజిటల్ గ్రంథాలయం ‘రాష్ట్రీయ ఈ-పుస్తకాలయ’ గురించి విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ వేదికను వినియోగించుకోవాలని, పఠన అలవాట్లను పెంపొందించుకోవాలని, తమ జ్ఞాన పరిధిని విస్తరించుకోవాలని వారిని ప్రోత్సహించారు.

నమో ఘాట్‌లో 50కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి, కాశీ, తమిళనాడు ప్రాంతాల హస్తకళలు, సంప్రదాయ ఉత్పత్తులు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. కాశీ, తమిళనాడుల విభిన్న కళా సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రతి సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు తిరుచిరాపల్లికి చెందిన తమిళ జానపద నృత్యం, వారణాసికి చెందిన కళాకారుడి భజనలు, చెన్నైకి చెందిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన సహా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

కాశీ తమిళ సంగమం 5.0లో భాగంగా, తమిళనాడుకు చెందిన 50 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు 2026 నవంబర్ 30 నుంచి వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యల్లోని ఎంపిక చేసిన పాఠశాలల్లో 11, 12వ తరగతుల విద్యార్థులకు తిరుక్కురళ్ బోధనలు, విలువలను పరిచయం చేయనున్నారు. ఈ కార్యక్రమం 10 పనిదినాల పాటు కొనసాగుతుంది. ఇందులో 20 మంది ఉపాధ్యాయులను వారణాసిలో, 15 మంది చొప్పున అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లలో నియమించనున్నారు.

 

ఈరోజు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

****


(రిలీజ్ ఐడి: 2343590) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati , Tamil , Kannada