నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2026 2:28PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, వికసిత్ భారత్ సాధనకు మార్గదర్శిగా రాజ్యాంగం నిలిచిన విధానాన్ని వివరిస్తూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై దృష్టి సారిస్తూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న సంక్షేమ పథకాలు, చరిత్రాత్మక రాజ్యాంగ నిబంధనల గురించి శ్రీ మేఘ్వాల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే దేశ నిర్మాణంలో రాజ్యాంగ విలువలకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘సామాజిక న్యాయం, వికసిత్ భారత్ సాధనకు మార్గదర్శిగా రాజ్యాంగం నిలిచింది.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా దేశాన్ని మరింత ముందుకు నడిపించే సంక్షేమ కార్యక్రమాలు, రాజ్యాంగ నిబంధనల గురించి కేంద్ర సహాయ మంత్రి @arjunrammeghwal రాశారు.
వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. దేశ నిర్మాణంలో రాజ్యాంగ విలువలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన తెలియజేశారు.’’