ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లాచిత్ దివస్ సందర్భంగా మహనీయుడు లాచిత్ బోర్ఫుకన్‌కు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 8:42AM by PIB Hyderabad

లాచిత్ దివస్ ఈ రోజు. ఈ సందర్భంగా మహనీయుడు లాచిత్ బోర్ఫుకన్‌కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అస్సాం ప్రజానీకాన్ని రక్షించడానికి లాచిత్ బోర్ఫుకన్‌ కనబరిచిన ధైర్య సాహసాలను, దృఢ సంకల్పాన్ని ప్రధానమంత్రి స్మరించుకున్నారు.

లాచిత్ బోర్ఫుకన్ అసాధారణ నాయకత్వం, ప్రజలంటే ఆయనకున్న అంకితభావం తరాల తరబడి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, అంతేకాక అస్సాం శక్తిని, ఉత్సాహాన్ని గుర్తుకు తెస్తుంటుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘లాచిత్ దివస్ సందర్భంగా మహనీయుడు లాచిత్ బోర్ఫుకన్‌కు మనమంతా నివాళులు అర్పిస్తున్నాం.  లాచిత్ బోర్ఫుకన్‌ కనబరిచిన ధైర్య సాహసాలు, దృఢ సంకల్పం అస్సాం ప్రజల రక్షణకు తోడ్పడ్డాయి.
ఆ మహనీయుని అసాధారణ నేతృత్వ సామర్థ్యం, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తుంటాయి. అంతేకాదు, అస్సాంకున్న శక్తిని, ఉత్సాహాన్ని కూడా మనకు గుర్తుకు తెస్తుంటాయి.’’
লাচিত দিৱসৰ পৱিত্ৰ ক্ষণত আমি মহান বীৰ লাচিত বৰফুকনক শ্ৰদ্ধাৰে স্মৰণ কৰিছোঁ, যাৰ সাহস আৰু দৃঢ় সংকল্পই অসমক সুৰক্ষিত কৰাত গুৰুত্বপূৰ্ণ ভূমিকা পালন কৰিছিল।
তেওঁৰ অসাধাৰণ নেতৃত্ব আৰু জনসাধাৰণৰ প্ৰতি থকা একনিষ্ঠ সেৱাৰ মনোভাবে আজিও প্ৰজন্মৰ পিছত প্ৰজন্মক অনুপ্ৰাণিত কৰি আহিছে। একেদৰে, তেওঁৰ জীৱনাদৰ্শই আমাক অসমৰ শক্তি, সাহস আৰু স্বাভিমানৰ কথাও সোঁৱৰাই দিয়ে।" అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2340757) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Gujarati , Malayalam