సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఎఫ్ఎస్‌సీ ఫెలోషిప్ సాయంతో ఉన్నత విద్యకు ఊతం


పీహెచ్‌డీ పరిశోధక విద్యార్థికి పరిశోధన, నైపుణ్యాలు,
ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఫెలోషిప్

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 4:07PM by PIB Hyderabad

అర్హులైన పరిశోధక విద్యార్థులలో కొందరికి అయినా సాయాన్ని అందిస్తే ఉన్నత విద్యను అభ్యసించడానికి, పరిశోధన మార్గంలో ముందుకు పోవడానికి, మరింత ఆర్థిక స్థిరత్వాన్ని సంతరించుకోవడానికి, వృత్తిపరంగా మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి దోహదం చేసినట్లవుతుందనడానికి శ్రీ రాజు (పేరు మార్చాం) జీవన గాథే అద్దం పడుతుంది.
ఉన్నత విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తే వారు తమ పరిశోధనను దీక్షగా కొనసాగించి, విద్యానైపుణ్యాలకు సాన పట్టుకొని, దీర్ఘకాలిక వృత్తిపరమైన ఆకాంక్షల్ని నెరవేర్చుకొనే దిశగా దూసుకుపోగలుగుతారు. మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడం వారి అవకాశాలకు ఒక గిరిని గీస్తాయి.
శ్రీ రాజు వయసు 36 ఏళ్లు. తెలంగాణలో సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థి. పీహెచ్‌డీ చదువుతున్నారు. ఆయనకు విద్యారంగ ప్రస్థానంలో ఆర్థిక కష్టాలతో పాటు, కుటుంబపరంగా గడ్డు పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక నిరుద్యోగ విద్యార్థిగా తన పరిశోధనను కొనసాగించడంలోను, విద్యలో తాను పెట్టుకున్న లక్ష్యం దిశగా సాగడంలోను ఆయనకు సవాళ్లు తటస్ఠించాయి.  
పీహెచ్‌డీని పూర్తి చేయాలని, అసిస్టెంట్ ప్రొఫెసర్ గానో లేదా రాష్ట్ర సేవలో గ్రూప్-వన్ అధికారి గానో ఎదగాలని భావించారు శ్రీ రాజు. తనకు కొన్ని చిక్కులు ఎదురైనప్పటికీ, విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని ఆయన కోరుకున్నారు. షెడ్యూల్డు కులాల విద్యార్థులకు అందించే జాతీయ ఫెలోషిప్ (ఎన్ఎఫ్ఎస్‌సీ)లో భాగంగా  2022 నవంబర్ నుంచి ఆయనకుసహాయం అందడం మొదలైంది. దీంతో ఇంటి అద్దె అలవెన్సు (హెచ్ఆర్ఏ), ఆకస్మిక సహాయం సమకూరాయి.


రూ.15 లక్షల మేర సహాయం లభించడంతో, ఆయన తన పరిశోధన తాలూకు పనిపై దృష్టిని కేంద్రీకరించి సమాచార సేకరణలో జోరును పెంచి, సాఫ్ట్ స్కిల్స్‌కు పదును పెట్టుకున్నారు. తనకు ఎదురైన ఆర్థిక క్లిష్ట స్థితులను శ్రీ రాజు అధిగమించడంతో పాటు, కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలోను ఈ సాయం దోహదం చేసింది.
ఈ ఫెలోషిప్ మంజూరు కావడంతో ఆయన విద్యాజీవితంలోను, వ్యక్తిగత జీవితంలోను సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన తన పరిశోధనను ముగించి, భావి వృత్తిజీవిత ఆకాంక్షలను నెరవేర్చుకొనే దిశగా నిలకడగా ముందుకు సాగిపోయేందుకు ఈ ఫెలోషిప్ తోడ్పడింది.

 
***

(రిలీజ్ ఐడి: 2340441) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Tamil