57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రెండో రోజు విశేషాలు

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 10:38PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340291Views: 10

గోవాలో జరుగుతున్న 57 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో ఈ రోజు (21 నవంబర్ 2026) సినీ ప్రముఖులతో చర్చలు, పత్రికా సమావేశాలు, చిత్ర ప్రదర్శనలు, రెడ్-కార్పెట్ కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమాలు చిత్ర రూపకర్తలు, నటులు, జ్యూరీ సభ్యులు, సినీ విమర్శకులు, సినీ ప్రియులను ఒకచోట చేర్చాయి. భారతీయ, అంతర్జాతీయ కథన వైవిధ్యాన్ని ప్రదర్శించాయి.

కళా అకాడమీలో సమకాలీన సినిమాపై ఆలోచనాత్మక చర్చలు, డాక్యుమెంటరీ ఫిలిం మేకింగ్ నుంచి ఇండియన్ పనోరమ, ఇంటర్నేషనల్ సినిమా, గోవా విభాగం, గాలా ప్రీమియర్లలో ప్రదర్శించే చిత్రాల స్క్రీనింగులు, ప్రీమియర్ల వరకు సృజనాత్మకతను పంచుకొనే వేదికను ఈ ఉత్సవం అందిస్తుంది. ఈ రోజు ప్రదర్శించిన చిత్రాల రూపకర్తలు, కళాకారులు రెడ్ కార్పెట్‌పై మెరిశారు. మీడియా సమావేశాల్లో వారి సృజనాత్మక ప్రయాణాన్ని, చిత్ర నిర్మాణంపై వారి ఆలోచనలను పంచుకున్నారు.

క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో (సీఎంవోటీ)--2026, ఇండియన్ పనోరమ కూడా ప్రారంభమయ్యాయి. ఇండియన్ పనోరమ–2026 జ్యూరీని సత్కరించారు.

కళా అకాడమీలో సినిమా చర్చలు

 

గోవాలో జరుగుతున్న  భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీలో) 2026 నవంబర్ 21న కళా అకాడమీలో ‘‘ది మోరల్ యూనివర్స్ ఆఫ్ పారలల్ సినిమా: 50 ఇయర్స్ ఆఫ్ గిరీష్ కాసరవల్లి’’ అనే కార్యక్రమం జరిగింది. ఇది సినీ ప్రేమికులను, చలనచిత్ర అభిమానులను ఒక్కచోట చేర్చింది.

డాక్యుమెంటరీ సినిమా, సామాజిక బాధ్యత

 

ఇఫీ–2026లో 2026 నవంబర్ 21న సమాజం, సమకాలీన సమస్యలను తెలియజెప్పడంలో డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం పోషించే పాత్రను  ‘‘ఫ్రం విట్‌నెస్ టు ఛేంజ్: ది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాక్యుమెంటరీ సినిమా’’ అనే చర్చలో అన్వేషించారు.

 

క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమార్ (సీఎంవోటీ)--2026 ప్రారంభోత్సవం

 

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా 2026 నవంబర్ 21న కళా అకాడమీలో సీఎంవోటీ–2026ను ప్రారంభించారు. 

 

ఇండియన్ పనోరమ–2026

 

2026 నవంబర్ 21న ఐనాక్స్ పాంజిమ్‌లో జరిగిన ఇండియన్ పనోరమ–2026 ప్రారంభోత్సవం, జ్యూరీ సత్కారం ఈ ఉత్సవంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచింది.

 

చిత్రరూపకర్తల మీడియా సమావేశం

 

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో ‘‘లుకింగ్ ఫర్ మైఖేల్’’ ప్రదర్శించిన సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించారు. దీనిలో చిత్ర దర్శకురాలు జువానా మాసియాస్, నటి లోరెనా లోపెజ్ మార్టినెజ్ మీడియాతో ముచ్చటించారు.

2026 నవంబర్ 21న గోవాలో జరిగిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో ఇండియన్ పనోరమ నాన్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఈ ఏడాది ‘‘బికమింగ్‌’’ను తొలి చిత్రంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో దర్శకురాలు లీనా యాదవ్, నిర్మాత అసీమ్ బజాజ్ మాట్లాడారు.

నవంబర్ 21, 2026న గోవాలోని పనాజీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఇండియన్ పనోరమ–2026 నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఛైర్‌పర్సన్ హిమాన్సు శేఖర్ ఖతువా, ఇతర జ్యూరీ సభ్యులు ప్రసంగించారు.

 

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో 2026 నవంబర్ 21న అంతర్జాతీయ సినిమా విభాగంలో తొలి చిత్రంగా “ఫాదర్‌ల్యాండ్”ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో నిర్మాత ఈవా పుస్జిన్స్కా మీడియాతో సంభాషించారు.

 

గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫీ)లో భాగంగా 2026 నవంబర్ 21న ఇండియన్ పనోరపమ ఫీచర్ చిత్ర విభాగంలో తొలి చిత్రంగా ‘‘దురంధర్’’ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నటుడు రాకేష్ బేడీ మీడియాతో ముచ్చటించారు.

 

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ–2026)లో 2026 నవంబర్ 21న ఇండియన్ పనోరమా ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఛైర్‌పర్సన్ విలేకరులతో ముచ్చటించారు.

 

ఉత్సవ చిత్రాలు

 

గోవాలోని పనాజీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ–2026) సందర్భంగా 2026 నవంబర్ 21న ఉత్సవ వేదిక వద్ద సందర్శకుల మధ్య ఉత్సాహంతో నిండిన క్షణం.

 

గోవాలో జరుగుతున్న 57వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫీ–2026)లో భాగంగా పనాజీలో సందడిగా ఉన్న వాతావరణం మధ్య సందర్శకులు విశ్రాంతి తీసుకుంటూ ముచ్చట్లలో మునిగిపోయారు.

 

 

రెడ్ కార్పెట్ ఉత్సవాలు

 

 

ఇఫీ–2026 రెడ్ కార్పెట్‌పై సినీ దర్శకనిర్మాతలు సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి వారికి ఘన స్వాగతం, ప్రశంసలు లభించాయి.

 

 

Read IFFILOID here: 

https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340291
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026