ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని కచ్‌ ప్రమాదంలో మృతుల పట్ల పీఎం సంతాపం… పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 10:57AM by PIB Hyderabad

గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి పరిహారం అందిస్తాం: పీఎం @narendramodi

***


(రిలీజ్ ఐడి: 2340171) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada