నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 4:01PM by PIB Hyderabad
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఐసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 19న ఉదయం సుమారు 11 గంటలకు ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు.
“భారత్ 2047” ఇతివృత్తంతో నిర్వహించే ఈ సదస్సుకు పరిశ్రమల దిగ్గజాలు, సీఈవోలు, రాయబారులు, దౌత్యవేత్తలు, విధానకర్తలు సహా 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. 2026-27 సంవత్సరం ఎఫ్ఐసీసీఐ కోసం శతజయంతి సంవత్సరం. 2027 ఏప్రిల్ 7 నాటికి ఈ సంస్థ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తి కానుంది.
1927లో ఎఫ్ఐసీసీఐని ఏర్పాటు చేశారు. ఆ కాలంలో భారతీయ సంస్థలకు ఆర్థిక విధాన రూపకల్పనలో పరిమిత ప్రాతినిధ్యం మాత్రమే ఉండేది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి... భారత ఆర్థిక పరివర్తనలోనూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో దేశం మరింత అనుసంధానం కావడంలోనూ ఎఫ్ఐసీసీఐ కీలక పాత్ర పోషించింది.
ప్రత్యక్షంగానూ... 300కు పైగా అనుబంధ ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి పరిశ్రమల సంఘాల ద్వారానూ... ప్రభుత్వ, ప్రైవేట్, బహుళజాతి రంగాల్లో 2.5 లక్షలకు పైగా కంపెనీలకు ఎఫ్ఐసీసీఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది 100కు పైగా దేశాల్లోని 250 జాతీయ వ్యాపార సంఘాలతో భాగస్వామ్య ఒప్పందాలను కలిగి ఉంది.
***