గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విడుదలైన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 ఫలితాలు

స్వచ్ఛ నగరాల జోడీ ఫలితాలను ప్రకటించిన కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని పట్టణాభివృద్ధి విభాగం

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద 'స్వచ్ఛ నగరాల జోడీ' కార్యక్రమంలో భాగంగా ఆదర్శప్రాయమైన పరస్పర అభ్యాసం, సహకారం, ఉత్తమ విధానాల అనుసరణకు గాను నగరాలకు గుర్తింపు

నాడు పోస్టు చేయడమైనది: 13 NOV 2026 9:24PM by PIB Hyderabad

ప్రపంచంలోనే అతిపెద్ద పట్టణ పారిశుద్ధ్య సర్వే అయిన 'స్వచ్ఛ సర్వేక్షణ్' 10వ విడతకు సంబంధించి 2026 నవంబర్ 11న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 పురస్కారాలను అందించారు. ‘పరిశుభ్రతలో నూతన చొరవ - చేతులు కలుపుదాం, కలిసి పరిశుభ్రతను సాధిద్దాం (స్వచ్ఛత కీ నయీ పహల్ - బఢాయేం హాథ్, కరేం సఫాయి సాథ్)’ అనే ఇతివృత్తంతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26ను నిర్వహించారు. కేంద్ర గృహ నిర్మాణ- పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్.. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖన్ సాహు సమక్షంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 విజేతలందరినీ సన్మానించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ 10వ విడతలో భాగంగా 10 విభాగాల్లోని 176 ఉప-సూచికలపై మొత్తం 4,751 పట్టణ స్థానిక సంస్థలను అంచనా వేశారు. శిక్షణ పొందిన 3,000 మందికి పైగా క్షేత్రస్థాయి అసెసర్లు దేశవ్యాప్తంగా నిజసమయ, జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ సహాయంతో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి సర్వేలను నిర్వహించారు. ఆధారాల సమర్పణ నుంచి పరిశీలన వరకు మొత్తం ప్రక్రియ డిజిటల్, పారదర్శకంగా ఉండటంతో పాటు అన్ని దశలలోనూ కఠినమైన నాణ్యత తనిఖీలకు లోనైంది.

ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 7 విభాగాల్లో మొత్తం 60 జాతీయ పురస్కారాలను ప్రకటించారు:

  1. టాప్ 3 స్వచ్ఛ నగరాల జోడీ(ఎస్ఎస్‌జే)

  2. టాప్ 3 స్వచ్ఛ నగరాలు (ఈ విభాగంలో 'స్వచ్ఛ నగరాల జోడీ' పురస్కారాలు పొందిన నగరాలకు మినహాయింపు ఇచ్చారు)

  3. 5 జనాభా విభాగాల్లో స్వచ్ఛ నగరం ర్యాంక్ 1, 2, 3

  4. స్వచ్ఛ నదీ తీర పట్టణం ర్యాంక్ 1, 2, 3

  5. స్వచ్ఛ తీర ప్రాంత పట్టణం ర్యాంక్ 1, 2, 3

  6. స్వచ్ఛ హిమాలయ నగరం ర్యాంక్ 1, 2, 3

  7. రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో మొదటి స్వచ్ఛ నగరం

2026 నవంబర్ 11న పట్టణ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 (ఎస్‌బీఎం-యూ) కింద చేపట్టిన ప్రముఖ పరస్పర అభ్యాస కార్యక్రమం అయిన 'స్వచ్ఛ నగరాల జోడీ' కింద అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి మూడు నగరాల జంటలను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకింగ్‌ల ఆధారంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 70 మార్గదర్శక (మెంటార్) నగరాలు, 33 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 191 మార్గదర్శకత్వం పొందిన (మెంటీ) నగరాలతో కూడిన మొట్టమొదటి పట్టణ వ్యర్థ పదార్థాల నిర్వహణ మార్గదర్శకత్వ (మెంటార్‌షిప్) కార్యక్రమంగా 'స్వచ్ఛ నగరాల జోడీ'ని కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ 2025 సెప్టెంబర్ 27న ప్రారంభించారు. 2025 సెప్టెంబర్‌లో సోనిపట్‌లో జరిగిన జాతీయ వేడుకలో మార్గదర్శకత్వ, మార్గదర్శకత్వం పొందిన నగరాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.

మంత్రిత్వ శాఖ ప్రకటించిన 191 జోడీలలో ప్రతి మార్గదర్శకత్వ నగరానికి చెందిన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జోడీని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

స్వచ్ఛ నగరాల జోడీల(ఎస్‌ఎస్‌జే) జాబితా

ఈ ఎస్‌ఎస్‌జే విభాగం.. 'ఒక్కో నగరం- మరొక్క నగరానికి నేర్పించటం (ఈచ్ వన్ - టీచ్ వన్)' సూత్రాన్ని ప్రోత్సహిస్తోంది. భారతదేశపు శాశ్వత 'గురు-శిష్య' సంప్రదానికి అనుగుణంగా ఇది ఉంది. ఇందులో పట్టణ శ్రేష్ఠత, పరిశుభ్రత దిశగా సాగే ప్రయాణాన్ని సమష్టిగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక నగరం నుంచి మరొక నగరానికి జ్ఞానం, అనుభవం, ఉత్తమ విధానాలు బదిలీ అవుతాయి.

మార్గదర్శకత్వ, మార్గదర్శకత్వం పొందిన నగరాల ఉమ్మడి మొత్తం స్కోర్‌ల ఆధారంగా పురస్కారాలు గెలుచుకున్న మొదటి 3 స్వచ్ఛ నగరాల జోడీలను గుర్తించారు. ఈ సమగ్ర స్కోరు.. స్వచ్ఛ నగరాల జోడీ కింద రెండు నగరాల ఉమ్మడి పనితీరు, సహకార ప్రయత్నాలను తెలియజేస్తుంది. తద్వారా మొత్తం పరిశుభ్రత, సేవల పంపిణీ మెరుగుదలలతో పాటు మార్గదర్శకత్వ ఫలితాలను కూడా గుర్తిస్తుంది.

స్వచ్ఛ నగరాల జోడీ కింద పురస్కార విజేతలు:

స్వచ్ఛ నగరాల జోడీ ర్యాంక్ 1: అహ్మదాబాద్ (10 లక్షల కంటే ఎక్కువ జనాభా విభాగం), సానంద్ (20,000–50,000 జనాభా విభాగం)

స్వచ్ఛ నగరాల జోడీ ర్యాంక్ 2: ఇండోర్ (10 లక్షల కంటే ఎక్కువ జనాభా విభాగం), దేపాల్‌పూర్ (20,000 కంటే తక్కువ జనాభా విభాగం)

స్వచ్ఛ నగరాల జోడీ ర్యాంక్ 3: తిరుపతి (50,000–3 లక్షల జనాభా విభాగం), కుప్పం (20,000–50,000 జనాభా విభాగం)

అర్హత సాధించిన మార్గదర్శకత్వ- మార్గదర్శకత్వం పొందిన నగరాల జంటల జాబితా:

క్రమ సంఖ్య

రాష్ట్రం పేరు

మార్గదర్శకత్వ నగరం

మార్గదర్శకత్వం పొందిన నగరం

పురస్కారం, ఇతర అంశాలు

1

గుజరాత్

అహ్మదాబాద్

సానంద్

స్వచ్ఛ నగరాల జోడీ ర్యాంక్ 1

2

మధ్యప్రదేశ్

ఇండోర్

దేపాల్‌పూర్

స్వచ్ఛ నగరాల జోడీ ర్యాంక్ 2

3

ఆంధ్రప్రదేశ్

తిరుపతి

కుప్పం

స్వచ్ఛ నగరాల జోడీ ర్యాంక్ 3

4

ఆంధ్రప్రదేశ్

గుంటూరు

నూజివీడు

—

5

ఢిల్లీ

ఢిల్లీ

పల్వాల్

—

6

మధ్యప్రదేశ్

భోపాల్

బేరాసియా

—

7

ఉత్తరప్రదేశ్

లక్నో

రసూలాబాద్_యూ (ఎన్‌పీ)

—

8

ఒడిశా

అస్కా

ఒడగావ్

—

9

ఛత్తీస్‌గఢ్

రాయ్‌పూర్

బీర్‌గావ్ (ఎం)

—

10

ఛత్తీస్‌గఢ్

బిలాస్‌పూర్

రతన్‌పూర్ (ఎన్‌పీ)

—

11

ఒడిశా

భువనేశ్వర్

జోదా (ఎం)

—

12

మహారాష్ట్ర

నవీ ముంబై

కన్నడ్

—

13

మహారాష్ట్ర

పంచగని

బేసా-పిప్లా

—

14

ఛత్తీస్‌గఢ్

బిల్హా

కోటా (ఎన్‌పీ)

—

15

గోవా

పనాజీ

మడ్గావ్

—

16

మహారాష్ట్ర

దేవ్‌లాలీ ప్రవర

పేఠ్

—

17

ఉత్తరప్రదేశ్

నోయిడా

బిఠూర్ (ఎన్‌పీ)

—

18

ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి (రాజమహేంద్రవరం)

పిఠాపురం

—

19

ఛత్తీస్‌గఢ్

అంబికాపూర్

వైకుంఠ్‌పూర్ (ఎం)

—

20

తెలంగాణ

గ్రేటర్ హైదరాబాద్

మంథని

—

21

ఛత్తీస్‌గఢ్

పటాన్

గురూర్ (ఎన్‌పీ)

—

22

మహారాష్ట్ర

మీరా-భయందర్

డెగ్లూర్

—

23

మధ్యప్రదేశ్

గ్వాలియర్

దాబ్రా

—

24

ఛత్తీస్‌గఢ్

కుమ్హారీ

అహివారా (ఎన్‌పీ)

—

25

కేరళ

మట్టన్నూర్ (ఎం)

చిత్తూర్-తతమంగళం

—

26

గుజరాత్

సూరత్

మాండ్వి

—

27

ఆంధ్రప్రదేశ్

విజయవాడ

చింతలపూడి

—

28

జమ్మూ కాశ్మీర్

జమ్మూ

చరార్-ఇ-షరీఫ్ (ఎంసీ)

—

29

మహారాష్ట్ర

పింప్రి చించ్వాడ్

లఖందూర్

—

30

ఒడిశా

చికిటి

నీలగిరి (ఎన్ఏసీ)

—

31

హర్యానా

కర్నాల్

ఇస్మాయిలాబాద్

—

32

కర్ణాటక

మైసూరు

రాయచూర్ (సీఎంసీ)

—

33

గోవా

సాంక్వెలిమ్

బిచోలిమ్

—

34

జార్ఖండ్

జంషెడ్‌పూర్

గిరిడిహ్

—

35

మహారాష్ట్ర

పన్హాలా

మహాలుంగ్ శ్రీపూర్

—

36

హర్యానా

సోనిపట్

హోడల్

—

37

గుజరాత్

గాంధీనగర్

జామ్‌జోధ్‌పూర్

—

38

గుజరాత్

వడోదర

సిహోర్

—

39

డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ

డామన్

డయ్యూ

—

 

జోడీ ర్యాంక్

రాష్ట్రం పేరు

మార్గదర్శకత్వ నగరం

మార్గదర్శకత్వం పొందిన నగరం

పురస్కారం, ఇతర అంశాలు

40

బీహార్

పాట్నా

చన్‌పతియా

—

41

మహారాష్ట్ర

వీటా

తుల్జాపూర్

—

42

మహారాష్ట్ర

కరాడ్

సంగ్రాంపూర్

—

43

మహారాష్ట్ర

సస్వాడ్

దేవ్ని

—

44

ఉత్తరాఖండ్

లాల్‌కువాన్

రాంపూర్

—

45

అస్సాం

గౌహతి

మారిగావ్ ఎంబీ

—

46

మహారాష్ట్ర

లోనావాలా

కాంద్రి (కన్హాన్)

—

47

త్రిపుర

ఖోవై (ఎన్‌పీ)

రాణిర్‌బజార్ (ఎన్‌పీ)

—

48

ఉత్తరప్రదేశ్

ఆగ్రా

రానియా (ఎన్‌పీ)

—

49

హిమాచల్ ప్రదేశ్

థియోగ్ (ఎంసీఎల్)

కందఘాట్

—

50

తమిళనాడు

నామక్కల్

కిళంపాడి

—

51

ఛత్తీస్‌గఢ్

విశ్రాంపూర్ (ఎన్‌పీ)

జర్హి (ఎన్‌పీ)

—

52

కర్ణాటక

దావణగెరె

హిరేకెరూర్ (టీపీ)

—

53

మణిపూర్

జిరిబామ్

ఆండ్రో నగర్

—

54

జార్ఖండ్

బుందు

ఫుస్రో

—

55

సిక్కిం

మంగన్

రంగ్‌పో

—

56

లడఖ్

కార్గిల్

లేహ్

—

57

పుదుచ్చేరి

ఔల్‌గరెట్- ఉళవర్‌కరై

కరైకల్

—

58

మిజోరం

లుంగ్లెయ్

లాంగ్‌ట్లై

—

59

అరుణాచల్ ప్రదేశ్

జైరాంపూర్

యాచులి

—

60

మేఘాలయ

షిల్లాంగ్

రెసుబెల్‌పారా

—

61

నాగాలాండ్

జాలుకీ (టీసీ)

అబోయ్ టౌన్ కౌన్సిల్

—

62

మధ్యప్రదేశ్

దేవాస్

సోన్‌కచ్

—

63

మధ్యప్రదేశ్

ఉజ్జయిని

ఉన్హెల్

మంత్రిత్వ శాఖ అందించిన జాబితా నుంచి మార్గదర్శకత్వ నగరాన్ని ఎంపిక చేయనందున పరిగణనలోకి తీసుకోని జోడీలు

64

చండీగఢ్

చండీగఢ్

పంచకుల

65

రాజస్థాన్

జైపూర్

బగ్రూ (ఎం)

66

పంజాబ్

భటిండా

రామన్

67

మధ్యప్రదేశ్

షాగంజ్

బాడీ

68

మధ్యప్రదేశ్

బుధ్ని

రెహతి

69

అస్సాం

నార్త్ లఖింపూర్

నారాయణ్‌పూర్ ఎంబీ

70

రాజస్థాన్

దుంగార్‌పూర్

సగ్వారా (ఎం)

***

 


(రిలీజ్ ఐడి: 2336379) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil