ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోన్న ప్రత్యేక తృతీయ వైద్య సేవలు: 2021-22 నుంచి కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులలో 6 కోట్లు దాటిన ఓపీడీ కన్సల్టేషన్‌లు


ప్రధాన మంత్రి స్వస్థ సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) కింద 22 కొత్త ఎయిమ్స్ ఆమోదం.. వీటిలో పూర్తి కార్యకలాపాలు నిర్వహిస్తూ సమగ్ర వైద్య సంరక్షణ, వైద్య విద్య, పరిశోధనా సేవలను అందిస్తోన్న 18 సంస్థలు

వైద్య విద్య, పరిశోధనలను బలోపేతం చేయటంతో పాటు విశ్వసనీయ, అందుబాటు ధరల్లో తృతీయ వైద్య సేవల విషయంలో అసమతుల్యతలను తొలగిస్తోన్న పీఎంఎస్ఎస్‌వై ఎయిమ్స్ సంస్థల విస్తరణ

ప్రత్యేక వైద్య సేవల వినియోగం గణనీయంగా పెరగటాన్ని తెలియజేస్తోన్న కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులలో ఓపీడీ కన్సల్టేషన్‌ల వృద్ధి.. 2021-22 నాటి 50.03 లక్షల నుంచి 2025-26 నాటికి 144.96 లక్షలకు చేరుకున్న ఓపీడీ కన్సల్టేషన్‌లు

నాడు పోస్టు చేయడమైనది: 10 NOV 2026 6:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) కింద 2021-22లో ప్రారంభమైన కొత్త అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఆసుపత్రులు సంయుక్తంగా ఐదేళ్ల కాలంలోనే (31 అక్టోబర్ 2026 నాటికి) 6 కోట్లకు పైగా ఓపీడీ(అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్) కన్సల్టేషన్‌లను నమోదు చేశాయి. ఈ ఘనత సదరు సంస్థల విస్తృత సేవలకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రత్యేక తృతీయ వైద్య సంరక్షణ సేవలను చేరువ చేయడంలో అవి పోషిస్తోన్న పాత్రను తెలియజేస్తోంది.

అందుబాటు ధరల్లో విశ్వసనీయమైన తృతీయ వైద్య సేవలు లభించే విషయంలో ఉన్న ప్రాంతీయ అసమతుల్యతలను తొలగించడానికి భారత ప్రభుత్వం పీఎంఎస్ఎస్‌వై కింద ఎయిమ్స్ నెట్‌వర్క్‌ను నిరంతరం విస్తరిస్తోంది. ఈ వినూత్న కార్యక్రమం ప్రత్యేక వైద్య సేవల విస్తరణతో పాటు దేశంలోని వైద్య విద్య, పరిశోధనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తోంది.

వివిధ దశల్లో పీఎంఎస్‌ఎస్‌వై కింద ఆమోదించిన 22 కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులలో 18 సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు అవుట్‌పేషెంట్ (ఓపీడీ), ఇన్‌పేషెంట్ (ఐపీడీ) సంరక్షణ..  అత్యవసర- ట్రామా సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య విద్య- పరిశోధనలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్నాయి.

ఈ సంస్థల సేవలకు పెరుగుతున్న ఆదరణ, వినియోగం ప్రతి సంవత్సరం నమోదు అవుతున్న ఓపీడీ గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఓపీడీ కన్సల్టేషన్‌లు 2021-22లో 50.03 లక్షలుగా ఉండేవి. అవి 2022-23 నాటికి 77.95 లక్షలకు, 2023-24 నాటికి 100.52 లక్షలకు పెరిగాయి. ఆ తర్వాత 2024-25లో 129.98 లక్షలకు, 2025-26 నాటికి 144.96 లక్షలకు చేరుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో అక్టోబర్ నాటికి కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులు 97.41 లక్షల ఓపీడీ కన్సల్టేషన్‌లను నమోదు చేశాయి. ఈ సంవత్సరాలన్నింటిలో ఓపీడీ కన్సల్టేషన్‌లు దాదాపు 6.01 కోట్లకు చేరాయి.

కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులు ప్రత్యేక క్లినికల్ వసతులు, ఆధునిక వైద్య సేవలను పెంపొందించడంతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), నర్సింగ్ విద్యా అవకాశాలను సైతం గణనీయంగా విస్తరించాయి. ఈ సంస్థలన్నీ కలిసి భారత వైద్య విద్య, పరిశోధనా మౌలిక సదుపాయాల సమగ్ర విస్తరణకు దోహదపడుతున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2334833) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil