నాడు పోస్టు చేయడమైనది:
09 NOV 2026 10:06AM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దేవభూమి ఉత్తరాఖండ్.. ఆధ్యాత్మిక వారసత్వానికి, విశేష ప్రాకృతిక శోభకు ప్రసిద్ధి చెందిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. మనోహర పర్వత ప్రాంతాలు, పవిత్ర నదులు, పూజనీయ చార్‌ధామ్ సహా వైభవోపేత సాంస్కృతిక వారసత్వానికి కూడా ఈ రాష్ట్రం మారుపేరంటూ ఆయన కొనియాడారు.
కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులూ, ప్రగతిశీలురైన ప్రజల భాగస్వామ్యంతో ఉత్తరాఖండ్ సర్వతోముఖ అభివృద్ధి చెందుతోందని శ్రీ మోదీ అన్నారు. ఉత్తరాఖండ్ ఇక ముందు కూడా ప్రగతి పథంలో వేగంగా పయనించగలదన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, సౌభాగ్యంతో అలరారుతుండాలని ఆయన ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా హార్దిక శుభకామనలు.
మన ఈ దేవభూమి ఆధ్యాత్మిక చేతనతో, అద్భుత ప్రాకృతిక సౌందర్యంతో శోభిల్లుతున్నది. మనోహరమైన పర్వతీయ భూభాగాలు, పవిత్ర నదులు, పావన చార్‌ధామ్‌తో విలసిల్లుతున్న ఈ రాష్ట్రం.. తన సాంస్కృతిక వారసత్వానికి కూడా విశిష్ట గుర్తింపును తెచ్చుకున్నది.
కష్టించి పనిచేసే, ప్రతిభావంతులు, ప్రగతిశీలురైన ప్రజల చురుకైన భాగస్వామ్యంతో ఉత్తరాఖండ్ ప్రస్తుతం ప్రతి రంగంలోనూ అభివృద్ధి పథంలో కొత్త శిఖరాలను అందుకుంటోంది. ప్రకృతి ప్రేమికులు, సంస్కృతి పట్ల మక్కువ చూపే ప్రజలు నివసిస్తున్న ఈ రాష్ట్రం.. ప్రగతి మార్గంలో నిరంతరం వేగాన్ని పుంజుకుంటూ, ముందు ముందుకు సాగిపోగలదని నేను విశ్వసిస్తున్నాను.
ఈ ప్రత్యేక సందర్భం రాష్ట్ర ప్రజలకు సుఖ శాంతులను, సౌభాగ్యాన్ని ప్రసాదించు గాక’’ అని పేర్కొన్నారు.