నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2026 6:44PM by PIB Hyderabad
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) 543 క్యాన్సర్ నిరోధక మందుల బ్రాండ్లకు సంబంధించి సవరించిన గరిష్ఠ రిటైల్ ధరల (ఎంఆర్‌పీ) జాబితాను విడుదల చేసింది. ఈ సవరించిన ధరలు నవంబర్ 9, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. అక్టోబర్ 27, 2026 వరకు కంపెనీలు అందించిన సమాచారం ఆధారంగా సవరించిన ధరల జాబితాను రూపొందించారు. నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నిరోధక మందుల సవరించిన ధరలను తయారీదారులు సమర్పించినప్పుడు ఈ జాబితాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు.
క్యాన్సర్ నిరోధక మందులకు సంబంధించిన కొన్ని బ్రాండ్లు, సవరణకు ముందున్న ధరలు, సవరించిన ధరలతో కూడిన జాబితా:
|
Company Name
|
Drug Name
|
Strength & Dosage Form
|
Brand Name
|
Pack Size
|
Old MRP (₹)
|
Revised MRP (₹)
|
|
RPG LIFE SCIENCES LTD
|
Anastrozole
|
1 MG Tablet
|
ANARZOLE
|
10 tablets
|
695.76
|
73.00
|
|
Dr. Reddys Laboratories Limited
|
Azacitidine
|
100 MG Injection
|
Azacytin
|
1
|
6,337.00
|
1,495.04
|
|
Abbott Healthcare Pvt. Ltd.
|
Bevacizumab
|
100 mg/4 ml Injection
|
BEVACIZAB
|
4 ml vial
|
21,767.70
|
5,930.13
|
|
NATCO PHARMA LIMITED
|
Dasatinib
|
20 MG Tablet
|
Dasanat 20
|
60 tablets
|
2,812.50
|
1,085.93
|
|
RPG LIFE SCIENCES LTD
|
Denosumab
|
60 MG Injection
|
Debrumab 60 mg
|
1 ml PFS
|
22,031.25
|
5,941.00
|
|
RPG LIFE SCIENCES LTD
|
Enzalutamide
|
40 MG Capsule
|
Enuta
|
28 capsules
|
6,578.20
|
2,232.00
|
|
NEON LABORATORIES LIMITED
|
Erlotinib
|
150 MG Tablet
|
ERLIB
|
1 Plastic Bottle of 30 tablets
|
4,637.45
|
2,008.00
|
|
HETERO HEALTHCARE LTD
|
Fludarabine
|
50 MG Injection
|
FLUDANOX
|
vial
|
14,235.00
|
2,432.00
|
|
RPG LIFE SCIENCES LTD
|
Fulvestrant
|
50 MG Injection
|
Fulbreca
|
5 ml vial
|
26,072.16
|
5,491.00
|
సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన 543 క్యాన్సర్ నిరోధక మందుల బ్రాండ్ల పూర్తి జాబితా ఇక్కడ (లింకు) అందుబాటులో ఉంది. ఎన్‌పీపీఏ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు.
క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, అధిక ట్రేడ్ మార్జిన్లను తగ్గించే ఉద్దేశంతో ప్రజాప్రయోజనాల దృష్ట్యా 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్)ను అక్టోబర్ 17, 2026న ఎన్‌పీపీఏ ప్రకటించింది. సవరించిన జాబితాను ఎన్‌పీపీఏకు సమర్పించాలని తయారీదారులకు ఆదేశాలిచ్చింది.
ఈ 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నిరోధక మందుల్లో 20కిపైగా రకాల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇమ్యునోథెరపీ మందులు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులు ఉపయోగించే డెనోసుమాబ్, క్యాన్సర్ రోగుల్లో న్యూట్రోపీనియాను నివారించేందుకు ఉపయోగించే పెగ్ఫిల్గ్రాస్టిమ్... పెద్దపేగు, అండాశయ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల చికిత్సకు ఆమోదించిన బెవాసిజుమాబ్ వంటివి ఉన్నాయి.
***