ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసి పర్యటన ముఖ్యాంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2026 10:02PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్.. వారణాసిలో తాను పర్యటించిన సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి ముఖ్యాంశాల్ని ప్రస్తావించారు. వాటిలో.. ప్రత్యేకమైన ఎయిర్ షో, ఉత్సాహకర రోడ్ షోతో పాటు తయారీ రంగంలో, మహిళలకు సాధికారత కల్పనలో వారణాసి సాధిస్తున్న పురోగతి వంటివి చోటు చేసుకున్నాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస సందేశాలలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘వారణాసి ఎయిర్ షో.. చాలా గొప్పగా ఉంది.’’
‘‘వారణాసిలో అరవింద్ సంస్థ వస్త్రాల తయారీ కేంద్రానికి సంబంధించిన అత్యుత్తమ విషయాల్లో ఒకటి ఏమిటంటే, దీనితో మహిళల సాధికారత కల్పనకు ప్రోత్సాహం లభిస్తుంది.’’
‘‘కాశీలో రోడ్ షో సందర్భంగా నా కుటుంబ సభ్యులు నాపై కురిపించిన అపార స్నేహం, ఆశీర్వాదాలతో నేను ఉప్పొంగిపోయాను.’’
‘‘వారణాసి నుంచి ప్రపంచానికంతటికీ!’’


(రిలీజ్ ఐడి: 2328358) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam