ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2026 ఆసియా పారా క్రీడలు - చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ 114 పతకాలు సాధించడంపై ప్రధానమంత్రి హర్షం

నాడు పోస్టు చేయడమైనది: 25 OCT 2026 8:17AM by PIB Hyderabad

ఇటీవల ముగిసిన 2026 ఆసియా పారా క్రీడల్లో భారత పారా అథ్లెట్లు సాధించిన అసాధారణ విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

రికార్డు స్థాయిలో 114 పతకాలు సాధించడం ద్వారా ఈ క్రీడల్లో భారత్‌  చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది యావత్‌ దేశానికి ఎంతో గర్వకారణమైన, ఆనందదాయకమైన సందర్భమని అన్నారు. అద్భుతమైన పట్టుదల, సంకల్పంతో రాణించిన భారత బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ చారిత్రక విజయంలో ప్రతి క్రీడాకారుడి పాత్ర ఉందని, తమ విజయాలతో లెక్కలేనంత మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చారని ప్రధానమంత్రి ప్రశంసించారు.

“ఇటీవల ముగిసిన ఆసియా పారా క్రీడలు -  2026లో మన పారా అథ్లెట్లు సాధించిన విజయం అసాధారణమైనది! రికార్డు స్థాయిలో 114 పతకాలు సాధించడం ద్వారా ఈ క్రీడల్లో భారత్‌  అత్యుత్తమ రీతిలో చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఇది యావత్‌ దేశానికి ఎంతో గర్వకారణమైన, ఆనందదాయకమైన సందర్భం! అసాధారణమైన పట్టుదల, సంకల్పంతో రాణించిన మన భారత బృందంలోని ప్రతి ఒక్కరికీ అభినందనలు.  ఈ చారిత్రక విజయంలో ప్రతి క్రీడాకారుడూ భాగస్వామిగా నిలిచారు. తమ విజయాలతో లెక్కలేనంత మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చారు” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. 

***


(రిలీజ్ ఐడి: 2328154) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Malayalam