నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2026 8:53PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌లు), జాతీయ విపత్తు స్పందన బలగాలు (ఎన్‌డీఆర్ఎఫ్), అగ్నిమాపక సేవల విభాగం, వైద్య సేవలు, ఇతర ప్రజా రక్షణ సంస్థలకు మిషన్ క్రిటికల్ పుష్-టు-టాక్ (ఎంసీపీటీటీ), మిషన్ క్రిటికల్ డేటా, మిషన్ క్రిటికల్ వీడియో సామర్థ్యాలను అందించేందుకు 'పాన్-ఇండియా డెడికేటెడ్ బ్రాడ్‌బ్యాండ్ పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (బీబీ-పీపీడీఆర్) నెట్‌వర్క్'ను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) భావిస్తోంది.
ఈ ప్రతిపాదిత ‘బ్రాడ్‌బ్యాండ్ పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (బీబీ-పీపీడీఆర్) కమ్యూనికేషన్ వ్యవస్థ’కు సంబంధించిన నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్ రూపకల్పన, రెఫరెన్స్ ఆర్కిటెక్చర్ తయారీ విషయంలో హోంశాఖ ప్రజాభిప్రాయాలను, సంబంధిత భాగస్వామ్య పక్షాల సూచనలను ఆహ్వానిస్తోంది. డిజైన్ ఎంపికలు, స్వీకరించాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, వాటి గుణాగుణాలు లేదా సాధ్యాసాధ్యాలు, వ్యయ సమర్థత, భారతీయ పరిస్థితులకు అనుకూలతపై సూచనలను అందించొచ్చు. దీనికి సంబంధించిన వివరణాత్మక విధాన పత్రం (కాన్సెప్ట్ నోట్) కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ - హోం/డాక్యూమెంట్స్/ఆర్డర్స్ అండ్ సర్కూలర్స్), డైరెక్టరేట్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్‌లెస్ (డీసీపీడబ్ల్యూ - హోం/డాక్యూమెంట్స్/స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్స్, హోం/అనౌన్స్‌మెంట్స్ అండ్ హోం/వాట్స్ న్యూ) అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది.
సంబంధిత భాగస్వామ్య పక్షాలందరూ తమ అభిప్రాయాలు, సూచనలను “బీబీ-పీపీడీఆర్ ఆర్కిటెక్చర్— స్టేక్‌హోల్డర్ ఫీడ్‌బ్యాక్” సబ్జెక్ట్ లైన్‌తో dd-ppdr@dcpw.gov.in, ad.ppdr@dcpw.gov.in ఈమెయిల్‌లకు 2026 నవంబర్ 05లోగా పంపాల్సిందిగా కోరడమైంది.
***