ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచిన ప్రణవ్ సూర్మ, ధరంబీర్‌లకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2026 10:27PM by PIB Hyderabad

ఆసియా పారా గేమ్స్‌ పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో కొత్త రికార్డుతో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ప్రణవ్ సూర్మకు, కాంస్యం గెలిచిన ధరంబీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.

వారి విజయాలు దేశానికి గర్వకారణమని, వారు ఇలాగే రాణిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

"ఆసియా పారా క్రీడల్లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో స్వర్ణం, కాంస్య పతకం సాధించిన భారత్!

ఈ గేమ్‌లో కొత్త రికార్డుతో తన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ప్రణవ్ సూర్మకు, కాంస్యం గెలుచుకున్న ధరంబీర్‌కు అభినందనలు. వారి విజయాలు దేశానికి గర్వకారణం. వారు ఇలాగే రాణించాలని ఆశిస్తున్నా. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా : ప్రధానమంత్రి @narendramodi"

 

(రిలీజ్ ఐడి: 2327923) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil , Malayalam