సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ, ఉన్నత విద్య లక్ష్యాల సాధన దిశగా
ఎన్ఎఫ్ఎస్సీ పథకం ద్వారా ఉన్నత
విద్యను అభ్యసిస్తున్న తెలంగాణలోని
హనుమకొండ జిల్లాకు చెందిన అర్జున్ కుమార్ విజయగాథ
నాడు పోస్టు చేయడమైనది:
21 OCT 2026 4:18PM by PIB Hyderabad
ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించే విద్యార్థులు తమ ఆర్థిక పరిమితులను అధిగమించి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడంలో ఆర్థిక సహాయం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది.
తెలంగాణలోని హనుమకొండ జిల్లాకు చెందిన డాక్టరల్ పరిశోధక విద్యార్థి అర్జున్ కుమార్ ( పేరు మార్పు) ప్రయాణం గమనిస్తే షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల జాతీయ ఫెలోషిప్ (ఎన్ఎఫ్ఎస్సీ) పథకం ద్వారా అందే సహాయం విద్యార్థులు తమ పరిశోధనను కొనసాగించేందుకు, విద్యాపరమైన లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగేందుకు ఎలా తోడ్పడుతుందో తెలియజేస్తుంది.
ఆర్థికంగా ఎంతో వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన అర్జున్ కుమార్ ఉన్నత విద్యను అభ్యసించే క్రమంలో అనేక ఆర్థిక, సామాజిక అడ్డంకులను ఎదుర్కొన్నారు. తగినంత డబ్బు లేని కారణంగా చదువును కొనసాగించడం, పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం ఆయనకు కష్టంగా మారింది. అయినప్పటికీ, ఈ సవాళ్లకు వెరవకుండా పీహెచ్డీ పూర్తి చేసి, ప్రొఫెసర్గా ఎదగాలన్న తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగారు.
2022లో ఎన్ఎఫ్ఎస్సీ పథకం కింద సహాయం అందడం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన జీవితంలో గణనీయమైన మార్పు మొదలైంది. ఈ ఫెలోషిప్, అదనపు ఖర్చుల కోసం అందిన ఆర్థిక సహాయం ద్వారా డాక్టరల్ చదువులకు సంబంధించిన ఖర్చులను నిర్వహించుకుంటూ పరిశోధనను కొనసాగించగలిగారు. ఆయన విద్యాభ్యాసానికి ఆటంకం కలిగించే స్థాయికి చేరిన ఆర్థిక ఒత్తిడి ఈ సహాయంతో తగ్గింది. ఫలితంగా చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం లభించింది.
ఈ ఆర్థిక సహాయం ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కూడా దోహదపడింది. పీహెచ్డీ కొనసాగిస్తూనే అర్జున్ కుమార్ తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలిగారు. ఈ సహాయం వల్ల కుటుంబ అవసరాలను తీర్చడంలో తన వంతు తోడ్పాటు అందిస్తూనే, విద్యాపరమైన లక్ష్యాల సాధన దిశగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ పరిశోధనను కొనసాగించేందుకు తోడ్పడటం ద్వారా ఈ ఫెలోషిప్ ఆయన విద్యా, వ్యక్తిగత జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆయన ఆత్మవిశ్వాసాన్ని మరింత బలోపేతం చేసింది. లక్ష్యిత విద్యా సహాయం ద్వారా పరిశోధక విద్యార్థులు ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ, తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనపై నిబద్ధతతో ముందుకు సాగవచ్చని అర్జున్ కుమార్ అనుభవం తెలియజేస్తోంది.
ప్రొఫెసర్ కావాలన్న లక్ష్యంతో అర్జున్ కుమార్ తన పీహెచ్డీ కొనసాగిస్తున్నారు. ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలను విస్తరించడంలో నిరంతర ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ప్రయాణం తెలియజేస్తోంది. పరిశోధక విద్యార్థులు తమ కుటుంబాలకు అండగా నిలుస్తూ, దేశ విద్యా, మేధో వికాసానికి తోడ్పడేలా ఈ సహాయం దోహదపడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2326060)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11