ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారా క్రీడల్లో కాంస్యం గెలిచిన రావన్నీ వలసనైనికి ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2026 6:32PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 1500 మీటర్ల టీ11 విభాగంలో కాంస్య పతకం సాధించిన రవన్నీ వలసనైనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ఇది ఆమె కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన అని, ఎంతో శ్రమించి సాధించిన విజయమని ప్రధాని పేర్కొన్నారు. ఆమె ప్రదర్శన దేశంలోని పారా క్రీడాకారుల్లో కనిపించే పట్టుదల, దృఢ సంకల్పానికి ప్రతిబింబమని అన్నారు. ఈ ఘనత సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

 

‘‘వ్యక్తిగతంగా అత్యుత్తమ ప్రదర్శనతో సాధించిన గొప్ప విజయం.

 

ఆసియా పారా క్రీడలు 2026లో మహిళల 1500 మీటర్ల టీ11 విభాగంలో రవన్నీ వలసనైని కాంస్య పతకాన్ని సాధించారు. ఆమె ప్రదర్శన మన పారా క్రీడాకారుల్లో కనిపించే పట్టుదల, దృఢ సంకల్పానికి నిదర్శనం. ఆమెకు అభినందనలు’’ అని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.


(రిలీజ్ ఐడి: 2325874) సందర్శకుల సూచీ సంఖ్య : : 17