ప్రధాన మంత్రి కార్యాలయం
దేవీమాత దుర్గ ఆశీర్వాదాన్ని, సంరక్షణ ప్రధాన అనుగ్రహాన్ని స్తుతిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 8:39AM by PIB Hyderabad
భక్తిపూర్వకంగా దుర్గ అమ్మవారిని స్మరించే భక్తులు ఉన్నతిని, సౌభాగ్యాన్ని పొంది తీరుతారని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. దేవీమాతను ధ్యానించే వారిని సకల సంకటాల నుంచి అమ్మ తప్పక రక్షిస్తుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఈ శ్లోకం స్పష్టం చేస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘యైస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధిః ప్రజాయతే
యే త్వాం స్మరన్తి దేవేశి రక్షసే తాన్నసంశయః’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2325152)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam