బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6లో భాగంగా వ్యర్థాల నిర్వహణ ద్వారా రూ. 2.21 కోట్లు ఆర్జించిన ఈసీఎల్

62,720 చదరపు అడుగుల స్థలం ఖాళీ, 3,000లకు పైగా ఈ-ఫైళ్ల పరిశీలన

నాడు పోస్టు చేయడమైనది: 16 OCT 2026 6:02PM by PIB Hyderabad

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) కార్యాలయాల్లో పరిశుభ్రతను పాటించటం, వనరులను సద్వినియోగం చేసుకోవటం, పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమం-6లో భాగంగా వ్యర్థాల నిర్వహణ ద్వారా రూ. 2.21 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. తద్వారా 62,720 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని పొందింది.

అక్టోబర్ 2 నుంచి 16 వరకు జరిగిన ప్రగతి నివేదిక ప్రకారం.. కోల్ ఇండియాకు చెందిన ఈ అనుబంధ సంస్థ గుర్తించిన 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాల్లో 413.5 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించింది. ఇనుము వ్యర్థాల నిర్వహణ ద్వారా అక్టోబర్ 14న రూ. 2,21,31,359 ఆదాయం సమకూరింది. దీనివల్ల వనరుల పునరుద్ధరణతో పాటు పనికిరాని సామగ్రిని ఉత్పాదక రీతిలో ఉపయోగించుకునే అవకాశం లభించింది.

నిర్దేశిత లక్ష్యం 2,08,052 చదరపు అడుగులకు గానూ, కంపెనీ గుర్తించిన 10 ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టి 62,720 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేసింది. అంటే, నిర్దేశిత లక్ష్యంలో సుమారు 30 శాతం స్థలం ఖాళీ అయింది.

పరిపాలనాపరమైన అంశాల్లో కంపెనీ నిర్దేశిత లక్ష్యం 1,200కి గానూ భౌతికంగా 647 ఫైళ్లను పరిశీలించింది. 1,000 లక్ష్యానికి గానూ 567 అనవసర ఫైళ్లను తొలగించింది. అనవసరమైన రికార్డులను తగ్గించటం, కార్యాలయ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవటం, రికార్డుల నిర్వహణను మెరుగుపరచటం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

డిజిటల్ ఫైల్ నిర్వహణలోనూ గణనీయమైన పురోగతి నమోదైంది. నిర్దేశిత లక్ష్యం 3,800కి గానూ 3,098 ఈ-ఫైళ్లను పరిశీలించారు. ఇది 81 శాతానికి పైగా పురోగతిని సూచిస్తుంది. మూసివేయటానికి గుర్తించిన 3,600 ఈ-ఫైళ్లలో 2,148 ఫైళ్లను విజయవంతంగా మూసివేశారు. ఇది దాదాపు 60 శాతం లక్ష్యాన్ని సాధించింది.

సంస్థల్లో పరిశుభ్రతను నిలకడగా కొనసాగించటానికి, పరిపాలనా ప్రక్రియలను క్రమబద్ధీకరించటానికి, వనరులను సమర్థవంతంగా

 

(రిలీజ్ ఐడి: 2324795) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil