భారత పోటీ ప్రోత్సాహక సంఘం
త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ లిమిటెడ్లో మెజారిటీ వాటా కొనుగోలుకు జీఆర్టీ జ్యువెలర్స్ (ఇండియా) సంస్థకు సీసీఐ ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
14 OCT 2026 5:35PM by PIB Hyderabad
త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ లిమిటెడ్లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు జీఆర్టీ జ్యువెలర్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్కు భారత పోటీ సంఘం (సీసీఐ) ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదిత ఒప్పందంలో భాగంగా.. జీఆర్టీ జ్యువెలర్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ సంస్ధ (కొనుగోలుదారు/జీఆర్టీ), త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ లిమిటెడ్ (వాటా విక్రయిస్తున్న/టీబీజెడ్)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది.
కొనుగోలుదారు సంస్థ ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ. ఇది ప్రధానంగా భారత్లో రత్నాలు, ఆభరణాల తయారీ, విక్రయాల వ్యాపారంలో నిమగ్నమై ఉంది.
వాటా విక్రయ సంస్థ స్టాక్ మార్కెట్లో నమోదైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది కూడా భారత్లో రత్నాలు, ఆభరణాల తయారీ, విక్రయాల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
(రిలీజ్ ఐడి: 2323589)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2