గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వివిధ ప్రాయోజిత కార్యక్రమాల కింద రూపొందిన సాంకేతికతల వాణిజ్యీకరణ జాబితాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి


సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి నుంచి వాణిజ్యీకరణ దాకా- పరిశ్రమల రంగంతో పరిశోధన అనుసంధానం

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2026 7:13PM by PIB Hyderabad

   వివిధ ప్రాయోజిత కార్యక్రమాల కింద రూపొందిన సాంకేతికతల వాణిజ్యీకరణ జాబితాను బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు ఆవిష్కరించారు. గనుల మంత్రిత్వశాఖ , ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖల పరిధిలో ‘సైన్స్ అండ్‌ టెక్నాలజీ ప్రోగ్రామ్‌’ పేరిట పరిశ్రమల ప్రాయోజిత కార్యక్రమాల కింద ఇవి రూపొందాయి. స్వదేశీ సాంకేతికతల ప్రదర్శన, బదిలీ, అనుసరణ, పరిశ్రమల ద్వారా వాణిజ్యీకరణ సౌలభ్య కల్పన ద్వారా పరిశోధన-పరిశ్రమల మధ్య అంతరం తగ్గింపు దిశగా ఇదో కీలక మలుపు.

ప్రభుత్వ నిధులతో సాగే పరిశోధనలు, పరిశ్రమల మద్దతు గల ప్రాజెక్టుల ద్వారా రూపొందించిన సాంకేతికతల క్రమబద్ధ నమోదు, ప్రదర్శన సహా వాటికి ప్రోత్సాహం, పరిశ్రమల ద్వారా అనుసరన; సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, లైసెన్సింగ్, వాణిజ్యీకరణలను సులభతరం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞాన డెవలపర్లు, పరిశోధన సంస్థలు, ప్రయోగశాలలు, అంకుర సంస్థలు ‘ఎంఎస్‌ఎంఈ’లు, పరిశ్రమలను అనుసంధానించే ఉమ్మడి వేదికగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే, ఆశాజనక స్వదేశీ సాంకేతికతలన్నీ పరిశోధన-అభివృద్ధి స్థాయి నుంచి పారిశ్రామిక అనువర్తన దశకు పురోగమించేలా ఇది వెసులుబాటు కల్పిస్తుంది.

వినూత్న ప్రక్రియలు, నమూనాలు, ప్రయోగాత్మక స్థాయి సాంకేతికతలు, పేటెంట్లు, ఇతర వాణిజ్యపరమైన పరిష్కారాలు సహా విలువైన సాంకేతిక ఫలితాలను గణనీయ సంఖ్యలో గల పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులు అందించాయి. అయితే, ఇవి తరచూ వివిధ ప్రాజెక్టుల పరిధిలోని సంస్థలలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలతోపాటు సరికొత్త సాంకేతికతలను అనుసరించాలని భావించే వారికి సదరు సాంకేతికతలపై ధ్రువీకృత సాంకేతిక సమాచారాన్ని ఏకైక, అందుబాటులో గల సముదాయంలోకి తేవడం ఈ అంతరాన్ని పూరించేందుకు ప్రతిపాదిత కేటలాగ్ ఉపయోగపడుతుంది.

ఈ కార్యక్రమంలో భాగస్వామ్య సౌలభ్యం దిశగా సత్యభామ పోర్టల్ (https://research.mines.gov.in/) ద్వారా ప్రధాన పరిశోధకులు, సహ-ప్రధాన పరిశోధకులు, అనుసరణ సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన డెవలపర్ల నుంచి ప్రామాణిక ధ్రువీకృత సాంకేతిక సమాచారాన్ని మంత్రిత్వశాఖ కోరుతోంది. ఈ విధంగా అందే సమాచారం, సాంకేతిక ఫలితాల అంచనా సహా సాంకేతిక వివరాల ధ్రువీకరణ, టెక్నాలజీ ప్రొఫైల్‌ తయారీతోపాటు వాణిజ్యీకరణకు వీలున్న సాంకేతికతల గుర్తింపులో ఇది తోడ్పడుతుంది.

దేశంలో సాంకేతికత ఆధారిత, పరిశ్రమ-కేంద్రక ఆవిష్కరణావరణ వ్యవస్థ రూపకల్పనలో కీలక ఘట్టాన్ని వాణిజ్యీకరణ కేటలాగ్ సూచిస్తుంది. ఆశాజనక పరిశోధన ఫలితాలను  ఆచరణాత్మక పారిశ్రామిక పరిష్కారాలుగా, ఆర్థిక విలువగా, విస్తృత సాంకేతిక ప్రభావం గలవిగా రూపాంతరీకరించడంలో తనవంతు పాత్రను పోషిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2322596) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी