కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూడో అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం-2026ను ప్రారంభించిన

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా

అయిదు ఒప్పందాలపై సంతకం చేసిన భారత్ 6జీ అలయన్స్… 6జీ సాంకేతికతపై 9 శ్వేతపత్రాల ఆవిష్కరణ

న్యూఢిల్లీ 6జీ డిక్లరేషన్ పురోగతిపై సంయుక్త నివేదికల విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2026 9:32PM by PIB Hyderabad

న్యూఢిల్లీ ద్వారకలోని యశోభూమి వద్ద మూడో అంతర్జాతీయ భారత్ 6జీ సింపోజియం-2026ను భారత్ 6జీ అలయన్స్ (బీ6జీఏ) ఇవాళ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.

 

విధానరూపకర్తలు, ప్రపంచ సాంకేతిక కూటములు, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల ప్రముఖులు, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములను ఈ సింపోజియం ఒకచోట చేర్చింది. తదుపరి తరం కమ్యూనికేషన్ సాంకేతికతలు, భారతదేశ 6జీ లక్ష్యాల సాధనలో సహకారాన్ని పెంపొందించటమే దీని ఉద్దేశం.

 

ప్రపంచ పోటీతత్వ, స్వదేశీ, విశ్వసనీయమైన 6జీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ ప్రారంభోత్సవం కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా భారత్ 6జీ అలయన్స్ ఆధ్వర్యంలో అయిదు నూతన అవగాహనా ఒప్పందాలతో పాటు తొమ్మిది వర్కింగ్ గ్రూప్ శ్వేతప్రతాలను విడుదల చేశారు.

 

ప్రపంచ, పరిశ్రమల సహకారాన్ని బలోపేతం చేసే అయిదు నూతన ఒప్పందాలు

 

ప్రారంభోత్సవం సందర్భంగా భారత్ 6జీ అలయన్స్ కుదుర్చుకున్న ఒప్పందాలు:

జీఎస్ఎంఏ

 

వన్6జీ అసోసియేషన్

 

జీటీఐ అలయన్స్ లిమిటెడ్

 

6జీ ఇండస్ట్రీ ఫోరమ్ (6జీఐఎఫ్)

 

వాయిస్

 

ఈ సహకారాలు ప్రముఖ ప్రపంచ దేశాలు, పారిశ్రామిక వర్గాలతో భారత్ 6జీ అలయన్స్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. తదుపరి తరం వ్యవస్థల కోసం పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాలు, సాంకేతిక అభివృద్ధి, అమలులో అంతర్జాతీయ సహకారం పట్ల భారత్ నిబద్ధతను తెలియజేస్తాయి.

 

ఈ నూతన సహకారాల ద్వారా ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ, దేశీయ భాగస్వామ్యాలను భారత్ 6జీ అలయన్స్ మరింత బలోపేతం చేసుకుంటుంది. ఈ అలయన్స్‌కు ఇప్పటికే 10 అంతర్జాతీయ, 2 దేశీయ ఎంఓయూలు, ఎంఓఐలు ఉండగా… కొత్త వాటితో కలిపి 17 భాగస్వామ్యాలు అయ్యాయి.

 

తొమ్మిది శ్వేతపత్రాల విడుదల

 

పరిశ్రమలు, విద్యావేత్తలు, పరిశోధన, సాంకేతిక వ్యవస్థల ఉమ్మడి సాంకేతిక సహకారంతో తొమ్మిది వర్కింగ్ గ్రూప్ శ్వేతపత్రాలను భారత్ 6జీ అలయన్స్ విడుదల చేసింది.

 

6జీ సాంకేతిక ల్యాండ్‌స్కేప్ సర్వే, ఆర్ అండ్ డీ ప్రణాళిక, భారత్‌లోని వేదికలు, ప్రయత్నాలు

 

ఇంటిగ్రేటెడ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్ (ఐఎస్ఏసీ) ఫర్ 6జీ: సాంకేతికతలు, నిర్మాణాలు, అప్లికేషన్లు, భవిష్యత్ దిశా నిర్దేశం

 

ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్: 5జీ నుంచి 6జీ వరకు భారత బ్రాడ్‌బ్యాండ్‌కు కీలక ఆధారం

 

6జీలో ఆప్టికల్ టెక్నాలజీల పాత్ర

 

2030, భవిష్యత్ కోసం ఐఎంటీ స్పెక్ట్రమ్ సన్నద్ధతపై అవగాహన

 

పర్యావరణహిత 6జీ: కర్బన ఉద్గారాలు లేని వ్యవస్థల రూపకల్పన

 

సెల్యూలార్ అండ్ వైఫై సినర్జీ: సమ్మిళిత అనుసంధానతకు ప్రపంచ మార్గాలు

 

క్యాపిటివ్ నాన్-పబ్లిక్ నెట్‌వర్క్ (సీఎన్‌పీఎన్)

 

6జీ భద్రత

 

భారతదేశ 6జీ ప్రయాణానికి సంబంధించి కీలక సాంకేతిక, విధానపరమైన అంశాలను ఈ పత్రాలు తెలియజేస్తాయి. వీటిలో సాంకేతిక అభివృద్ధి, ప్రయోగాలు, స్పెక్ట్రమ్ సన్నద్ధత, సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్లు, బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానత, ఆప్టికల్ టెక్నాలజీస్, సుస్థిరత, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్స్, వైఫై-సెల్యూలార్ కన్వర్జెన్స్, భద్రత వంటి అంశాలున్నాయి.

న్యూఢిల్లీ ప్రకటనపై ఏడాదిగా జరిగిన పురోగతి

 

"న్యూఢిల్లీ డిక్లరేషన్ 6జీ అంశాల దిశగా పురోగతి: చర్యలు, ఫలితాలు, దృక్పథం- మొదటి ఎడిషన్, అక్టోబర్ 2026” సంయుక్త నివేదికను విడుదల చేయటమే ఈ ప్రారంభోత్సవంలో కీలక అంశం.

 

న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను అంతర్జాతీయ భారత్ 6జీ సిపోజియం-2025లో ఆమోదించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో పొందుపరిచిన అంశాలను ముందుకు తీసుకెళ్లటంలో ఎంఓయూ భాగస్వాములు సాధించిన పురోగతిని, చేపట్టిన చర్యలను, ఫలితాలను ఇది వివరిస్తుంది.

 

సురక్షిత, సుస్థిర, బహిరంగ, పరస్పరం అనుకూలంగా ఉండే, సమ్మిళిత, పర్యావరణహిత సాంకేతిక వ్యవస్థగా 6జీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు న్యూఢిల్లీ డిక్లరేషన్ సాధారణ వ్యవస్థను అందిస్తుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల రూపకల్పనలో అంతర్జాతీయ సహకారానికి ఇది ప్రాధాన్యతనిస్తుంది.

 

డిక్లరేషన్‌లోని అంశాలను సాకారం చేసేందుకు పాల్గొనే భాగస్వాముల ఉమ్మడి ప్రయత్నాలను సమీక్షించటానికి, భవిష్యత్ సాకారానికి తగిన మార్గదర్శకాలను అందించేందుకు ఈ ప్రగతి నివేదిక కీలక మార్గం.

 

ప్రపంచ 6జీ వ్యవస్థలో పెరుగుతున్న భారత్ పాత్ర

 

ఈ సదస్సులో ప్రకటించిన కార్యక్రమాలు… 6జీ సాంకేతికత, ప్రమాణాలు, వ్యవస్థల రూపకల్పనలో భారతదేశ, అంతర్జాతీయ భాగస్వాములను ఒకచోట చేర్చే వేదికగా భారత్ 6జీ అలయన్స్ పాత్రను స్పష్టం చేస్తున్నాయి.

 

పరిశ్రమ, విద్యా, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ భాగస్వాముల మధ్య సహకారాన్ని ఈ అలయన్స్ ప్రోత్సహిస్తూ వస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక అభివృద్ధి, ప్రయోగాలు, మేధోసంపత్తి హక్కుల కల్పన, అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో భారత్ సహకారాన్ని ఇది బలోపేతం చేస్తుంది.

 

శ్వేతపత్రాల విడుదల, ఎంఓయూ వ్యవస్థల విస్తరణ, న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై ఏడాది ప్రగతి నివేదిక వంటివి అంతర్జాతీయ 6జీ వ్యవస్థతో పెరుగుతున్న భారత్ భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

 

న్యూఢిల్లీలోని ద్వారకలో యశోభూమి వద్ద 2026 అక్టోబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించిన మూడో అంతర్జాతీయ భారత్ 6జీ సదస్సు-2026లో పలు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. గ్లోబల్ 6జీ విజన్, ప్రమాణాలు, సాంకేతిక నాయకత్వం, ప్రయోగాలు, టెస్ట్‌బెడ్లు, ఏఐ ఆధారిత సుస్థిర వ్యవస్థలు, స్పెక్ట్రమ్, పరిశ్రమల అవసరాలు, అంతర్జాతీయ సహకారం వంటివి చర్చల్లోని అంశాలు.

 

సురక్షిత, సమ్మిళిత, సుస్థిర, ప్రపంచవ్యాప్తంగా పరస్పరం అనుసంధానించదగిన 6జీ వ్యవస్థ నిర్మాణానికి సభ్య దేశాలు, అంతర్జాతీయ భాగస్వాములతో భారత్ 6జీ అలయన్స్ కొనసాగుతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తదుపరి తరం టెలికాం రంగ అభివృద్ధికి భారత్ సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.

 

మరిన్ని వివరాలకు డీఓటీ హ్యాండిల్స్‌ను అనుసరించండి:

 

ఎక్స్ - https://x.com/DoT_India

 

ఇన్‌స్టా- https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

 

ఎఫ్‌బీ- https://www.facebook.com/DoTIndia

 

యూట్యూబ్- https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

****


(రిలీజ్ ఐడి: 2321253) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Malayalam