సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి జ్ఞాపికల 8వ ఇ-వేలంలో 4,000 ఏళ్ల నాటి ధోక్రా నుంచి గిరిజన వారసత్వం వరకు సజీవ రూపాన్ని సంతరించుకున్న ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక గాథ

ఛత్తీస్‌గఢ్ ప్రాచీన లోహ పోత సంప్రదాయాలు, గిరిజన వారసత్వం, భక్తికి సంబంధించిన కళ, సమకాలీన సాంస్కృతిక గుర్తింపుకు ప్రతీకగా నిలిస్తోన్న జ్ఞాపికలు

అధికారిక పీఎం జ్ఞాపికల పోర్టల్ ద్వారా ఈ జ్ఞాపికల కోసం బిడి దాఖలు చేసే అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 07 OCT 2026 5:39PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 16 జ్ఞాపికలలో ప్రాచీన లోహ పోత సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవి రాష్ట్రానికి ఉన్న సుసంపన్నమైన గిరిజన వారసత్వం, భక్తి సంప్రదాయాలు, సమకాలీన సాంస్కృతిక గుర్తింపును ఒకచోట చేర్చాయి.

 

భారత్‌లో 4,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సంప్రదాయ 'లాస్ట్-వ్యాక్స్' లోహ పోత కళ అయిన 'ధోక్రా' వీటిలో ప్రధాన కేంద్ర బిందువుగా ఉంది. ఏనుగు తలతో కూడిన నంది, నిలబడి ఉన్న నంది, మాడియా-మాడిన్ గిరిజన దంపతుల సగం విగ్రహం వంటి అనేక ధోక్రా కళాఖండాలు ఈ సంప్రదాయానికి ఉన్న విశిష్ఠతను, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నాయి.

 

నెమలి ఈకల గుత్తి, గవ్వలు, లోహ బిళ్లలు, ఇత్తడి గంటలతో కూడిన సంప్రదాయ ఉత్సవ తలపాగా ద్వారా గిరిజన ఛత్తీస్‌గఢ్ కథ మరింత ముందుకెళ్తుంది. 

 

గిరిజన కళలతో పాటు ఈ జ్ఞాపికలు రాష్ట్ర రూపురేఖలను తీర్చిదిద్దే అనేక సాంస్కృతిక ప్రభావాలను ఏకం చేస్తున్నాయి. ‘రామ్ రామ్’ పదాలు పునరావృతమయ్యే శిలాశాసనాలతో ఉన్న 'రామ్‌నమి సమాజ్' జపం చేసే కండువా, విశ్వాసం- భక్తికి సంబంధించిన విశిష్ట అభివ్యక్తిని ప్రతిబింబిస్తుంది. హత్కేశ్వర్ మహాదేవ్, బుధేశ్వర్ మహాదేవ్, జై మా కుడర్గడి, మధేశ్వర్ మహాదేవ్‌లతో సహా ముఖ్యమైన మతపరమైన, సాంస్కృతిక ఘట్టాలను ఇతర జ్ఞాపికలు తెలియజేస్తున్నాయి.

 

ఈ జ్ఞాపికలు ఛత్తీస్‌గఢ్ మరింత సమకాలీన రూపాన్ని కూడా తెలియజేస్తున్నాయి. 'మహతారి వందన్ యోజన'ను చిత్రీకరించే చెక్కతో చేసిన ప్యానెల్, ఛత్తీస్‌గఢ్ విధానసభ రజతోత్సవ జ్యోతిని సూచించే జ్ఞాపిక, నవ రాయ్‌పూర్‌లోని సంస్థలకు ప్రాతినిధ్యం వహించే నమూనాలు రాష్ట్ర సంప్రదాయ వారసత్వంతో పాటు మారుతోన్న వర్తమానాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. 

ఈ జ్ఞాపికల సేకరణ ప్రధాన సందేశం ‘వారసత్వ కొనసాగింపే’. తరతరాలుగా రూపుదిద్దుకున్న సంప్రదాయాలు సమకాలీన వస్తువులలో కూడా తమ ఉనికిని చాటుకుంటూ ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక స్మృతిని ఇవి ముందుకు తీసుకువెళ్తున్నాయి.

 

ఈ వేలం ప్రస్తుతం కొనసాగుతోంది. ముగింపు తేదీని 2026 అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయం 'నమామి గంగే ప్రాజెక్ట్'కు ఉపయోగపడుతుంది. 

 

ఆసక్తి గల వారు అధికారిక పీఎం జ్ఞాపికల ఈ-వేలం పోర్టల్ (https://pmmementos.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో తమ బిడ్లను సమర్పించొచ్చు.


(రిలీజ్ ఐడి: 2320403) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu