ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల 97 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన దీపక్ పునియాకు ప్రధానమంత్రి అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2026 7:31PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో హోరాహోరీగా సాగిన పోరులో పురుషుల 97 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన దీపక్ పునియాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఆసియా క్రీడలు... పురుషుల 97 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో ఆరు దశాబ్దాల తర్వాత భారత్ తిరిగి బహుమతి స్వీకార వేదికపైకి వచ్చిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దీపక్ పునియా సాధించిన విజయం భారత రెజ్లింగ్ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని శ్రీ మోదీ అన్నారు. భవిష్యత్తులోనూ దీపక్ పునియా మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
“ఆరు దశాబ్దాల తర్వాత ఆసియా క్రీడల్లో పురుషుల 97 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత్ తిరిగి పతకం సాధించింది.! హోరాహోరీగా సాగిన పోరులో దీపక్ పునియా కాంస్య పతకాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. దీంతో భారత రెజ్లింగ్ ప్రస్థానంలో మరో కొత్త అధ్యాయం చేరింది. ఆయనకు అభినందనలు. రానున్న రోజుల్లో దీపక్ పునియా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.
*****
(రిలీజ్ ఐడి: 2318926)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam