ఉక్కు మంత్రిత్వ శాఖ
మిగిలి ఉన్న అంశాలను పరిష్కరించడానికి ‘ప్రత్యేక ప్రచార కార్యక్రమం 6’ను ప్రారంభించిన ఉక్కు శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 10:19AM by PIB Hyderabad
‘మిగిలి ఉన్న అంశాలను పరిష్కరించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం (స్పెషల్ క్యాంపెయిన్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ పెండింగ్ మేటర్స్.. ఎస్‌సీడీపీఎమ్) 6’ను ఉక్కు శాఖ, ఆ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈస్) చేపట్టాయి. ఈ నెల 2 నుంచి ఈ నెల 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉక్కు శాఖ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చురుకుగా పాల్గొంటున్నాయి.
ప్రచార ఉద్యమ సన్నాహక దశను కిందటి నెల 15 నుంచి కిందటి నెల 30 వరకు చేపట్టి, పూర్తి చేశారు. ఆ దశలో మంత్రిత్వ శాఖ, సీపీఎస్ఈలు అవసరమైన సన్నాహాలు చేయడంతో పాటు అమలు దశకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించాయి.
అమలు దశను ఈ నెల 2 నుంచి ఈ నెల 31 వరకు నిర్వహిస్తారు. ఈ దశలో మంత్రిత్వ శాఖ, సీపీఎస్ఈలు ఈ కింది కార్యకలాపాలపై దృష్టిని కేంద్రీకరిస్తాయి:
• స్వచ్ఛత ప్రచార ఉద్యమం: దీన్లో భాగంగా వివిధ కార్యాలయాలు, ప్రదేశాల్లో 301 శుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తారు.
• ఫైళ్ల పరిష్కారం: 20,763 ఫైళ్లతో పాటు 9,056 ఎలక్ట్రానిక్ ఫైళ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.
• ప్రజా ఫిర్యాదులు: నిలిచి ఉన్న 37 ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఏ ఒక్క ఫైలునూ పరిశీలన స్థితిలో అట్టిపెట్టకూడదన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
ఎంపీలు, ప్రధానమంత్రి కార్యాలయం, మంత్రిమండలితో పాటు రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసులు సహా అనిశ్చిత వ్యవహారాలను కాలబద్ధ రీతిన పరిష్కరించడంపై ఈ ప్రచార ఉద్యమంలో దృష్టి పెడతారు. స్వచ్ఛత, పాత ఫైళ్ల పని పూర్తి చేయడం, రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు కార్యాలయంలో జాగాను ఉత్తమమైన పద్దతిలో వినియోగించడంపై శ్రద్ధ వహిస్తారు.
‘మిగిలి ఉన్న అంశాలను పరిష్కరించడానికి ప్రత్యేక ప్రచార ఉద్యమం (ఎస్‌సీడీపీఎమ్) 6’ను అమలు చేస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ, సీపీఎస్ఈలు కలిసి పరిశీలనలో ఉన్న అంశాలను తగ్గించుకోవడం, అంశాలను వెంటవెంటనే చక్కబెట్టడం, ఉత్తమ సేవలను అందజేయడంతో పాటు పని ప్రదేశాలు శుభ్రంగా ఉండేటట్లు చూస్తూ, సమర్థ సేవల్ని అందించే దిశగా ముందుకు కదులుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2318378)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8