ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత 4×400 మీటర్ల రిలే జట్టుకు ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 7:24PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో పురుషుల 4×400 మీటర్ల రిలేలో అద్భుత సమన్వయంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్న ధర్మవీర్ చౌదరి, మను టి.ఎస్, జయకుమార్, విశాల్ టి.కెలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఇది స్ఫూర్తిదాయకమైన జట్టు కృషి అని, ఈ విజయ వేదిక వారికి సముచితమైన స్థానమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. వారు మున్ముందు మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ను వారు మరింత సమున్నత స్థానంలో నిలబెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలోని క్రీడాకారులకు ఈ విజయం ఎంతగానో స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

“పురుషుల 4×400 మీటర్ల రిలేలో అద్భుత సమన్వయంతో కాంస్య పతకాన్ని సాధించిన ధర్మవీర్ చౌదరి, మను టి.ఎస్, జయకుమార్, విశాల్ టి.కెలకు అభినందనలు. ఇది స్ఫూర్తిదాయకమైన జట్టు. ఈ విజయ వేదిక వారికి సముచితమైన స్థానం. మున్ముందు వారు మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు భారత్‌ను మరింత సమున్నతంగా నిలబెడతారన్న నమ్మకం నాకుంది. దేశంలోని క్రీడాకారులకు ఈ విజయం ఎంతగానో స్ఫూర్తినిస్తుంది: ప్రధానమంత్రి @narendramodi” 


(రిలీజ్ ఐడి: 2318335) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam