ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల గ్రీకో-రోమన్ 87 కిలోల ఈవెంట్‌లో కాంస్య పతక విజేతగా శ్రీ సునీల్ కుమార్... అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 11:53PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల గ్రీకో-రోమన్ 87 కిలోల ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన శ్రీ సునీల్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
శ్రీ సునీల్ కుమార్ 2022 లో సాధించిన తన విజయానికి తులతూగే చక్కనైన గెలుపుతో విజయ వేదికను అధిరోహించారని ప్రధానమంత్రి కొనియాడారు.
ఈ ప్రద్రర్శన భారతీయ కుస్తీ క్రీడా విభాగానికి ఆనందదాయక ఘడియ అని శ్రీ మోదీ వర్ణించారు. శ్రీ సునీల్ కుమార్ దేశానికి మరింత కీర్తిని అందించడంలో సఫలం కావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
‘‘ఆసియా క్రీడల్లో శ్రీ సునీల్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు.
అభినందనలు, సునీల్ గారూ. ఇది చక్కనైన ప్రదర్శన. భారతీయ కుస్తీ క్రీడావిభాగం సంతోషించదగిన ఘడియ. దేశానికి మరింత కీర్తిని సంపాదించి పెట్టడంలో శ్రీ సునీల్ ఇక ముందూ సఫలుడు అవ్వాలని ఆకాంక్షిస్తున్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’ అని పేర్కొంది.
(రిలీజ్ ఐడి: 2317512)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15