ప్రధాన మంత్రి కార్యాలయం
దృఢసంకల్పం, నిరంతర శ్రమల ప్రాధాన్యాన్ని చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 8:53AM by PIB Hyderabad
దృఢ నిశ్చయం, స్థిరచిత్తాన్ని కలిగి ఉండే వారు అనుకున్నది సాధించే వరకు ఎంచుకున్న బాట నుంచి వైదొలగరని చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. సాగర మథన వేళ దేవతలు విలువైన రత్నాలు వెలువడినా ప్రలోభపడక, ప్రాణాంతక హాలాహలం వెలువడినా బెదిరి వెనుకంజ వేయక, అమరత్వాన్ని సిద్ధింప చేసే అమృతాన్ని పొందేటంత వరకు ప్రయత్నాలను వదలిపెట్టలేదని ప్రధానమంత్రి అన్నారు.
‘‘రత్నైర్మహాబ్ధేస్తుతుషుర్న దేవా న భేజిరే భీమవిషేణ భీతిమ్
సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
సాగర గర్భంలో నుంచి విలువైన రత్నాలు, ప్రాణాంతక విషం బయటకు వచ్చినప్పుడు దేవతలు విస్తుపోక, బెదరిపోతూ వెనుకడుగు వేయకుండా అమరత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని చేజిక్కించుకొనేటంత వరకు ప్రయత్నాలకు విరామాన్ని ఇవ్వలేదు.. ఇదే మాదిరిగా దృఢసంకల్పం, ధీరులు కూడా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునే వరకు ఎన్నటికీ విశ్రమించరు అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘రత్నైర్మహాబ్ధేస్తుతుషుర్న దేవా న భేజిరే భీమవిషేణ భీతిమ్
సుధాం వినా న ప్రయయుర్విరామం న నిశ్చితార్థాద్విరమన్తి ధీరాః’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2317464)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4