బొగ్గు మంత్రిత్వ శాఖ
ప్రత్యేక కార్యక్రమం-6 అమలు దిశగా కోల్ ఇండియా లిమిటెడ్ సన్నాహాలపై మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి సమీక్ష
పరిశుభ్రత సంస్థాగతీకరణ.. పెండింగ్ అంశాల పరిష్కారం.. ‘వ్యర్థం నుంచి అర్థం’.. ఇ-వ్యర్థాల నిర్వహణ ముమ్మరం తదితరాలపై దృష్టి
ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల పరిధిలో 1,500కు పైగా ప్రక్షాళన ప్రదేశాల గుర్తింపు సహా దాదాపు 60,000 ఫైళ్ల పరిష్కారం లక్ష్యంగా సమీక్ష
నాడు పోస్టు చేయడమైనది:
30 SEP 2026 4:18PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వశాఖ నేతృత్వంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) పరిధిలో ప్రత్యేక కార్యక్రమం-6 అమలు దిశగా సన్నాహాలను కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ సమీక్షించారు. ఈ మేరకు ‘వ్యర్థం నుంచి అర్థం’, ఇ-వ్యర్థాల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమం కింద పరిశుభ్రత సంస్థాగతీకరణ, పెండింగ్‌లో అంశాల పరిష్కారంపైనా లక్ష్యనిర్దేశం చేసుకున్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి, సీఐఎల్ ఛైర్మన్, సీఎండీ, అనుబంధ సంస్థలతో పాటు ఇతర విభాగాల సీనియర్ అధికారులుఈ సమీక్షలో పాల్గొన్నారు.
కీలకాంశాలు.. సన్నాహక చర్యలు
ఆగ్నేయ బొగ్గు క్షేత్రాల సంస్థ (ఎస్‌ఈసీఎల్)లో పరిశుభ్రతపై అవగాహన దిశగా ప్రోత్సాహం:
ఈ కార్యక్రమం కింద బిలాస్‌పూర్‌లోని వసంత్ విహార్‌లో పరిశుభ్రతపై అవగాహన వాకథాన్ నిర్వహించారు. బాలలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని పరిశుభ్రత, పర్యావరణ హిత జీవనశైలిపై అవగాహన సందేశం వినిపించారు. అలాగే, ఇక్కడి ఎస్ఈసీఎల్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో “మన గడప-మన వ్యర్థాలు” ఇతివృత్తంగా వీధి నాటకం ప్రదర్శించారు. పరిశుభ్రత ప్రాధాన్యం, వ్యర్థాల సముచిత నిర్మూలన, పరిసర పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణ పరిరక్షణ, వ్యక్తిగత బాధ్యతల సమర్థ నిర్వహణ తదితరాలను వీక్షకులకు ఆసక్తికరంగా ప్రదర్శించారు.
ప్రక్షాళన ప్రదేశాల గుర్తింపు: బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్ సహా ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలతో సంయుక్తంగా అక్టోబరు 2 నుంచి 31 వరకూ చేపట్టే ప్రత్యేక కార్యక్రమం-6 అమలు కోసం 1,565 ప్రదేశాలను గుర్తించారు.
ఫైళ్ల నిర్వహణ: కార్యనిర్వహణ సామర్థ్యం మెరుగుదల, రికార్డుల సత్వర లభ్యత దిశగా 19,499 భౌతిక, 40,094 ఇ-ఫైళ్లపై సమీక్ష నిర్వహిస్తారు.
ఈ మేరకు సమర్థ పాలన-పారదర్శకతపై ప్రభుత్వ దృక్కోణాన్ని బలోపేతం చేస్తూ, ప్రత్యేక కార్యక్రమం-6 కింద నిర్దిష్ట వ్యవధిలోగా అన్ని లక్ష్యాల సాధనకు బొగ్గు మంత్రిత్వశాఖ సన్నద్ధమైంది.
***
(రిలీజ్ ఐడి: 2317132)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9