సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెత్త ఏరుకునే వృత్తి నుంచి మెరుగైన ఆర్థిక భద్రత వరకు కుమారగిరి అంకమ్మ ప్రయాణం

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 6:59PM by PIB Hyderabad

గుంటూరులో గత 25 ఏళ్లుగా చెత్త ఏరుకునే పనిచేస్తూ తక్కువ ఆదాయంతోనే కుమారగిరి అంకమ్మ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

 

'స్వచ్ఛతా ఉద్యమి యోజన' (ఎస్‌యూవీ) కింద అందిన ఆర్థిక సహాయం ఆమె జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, మెరుగైన ఆర్థిక భద్రతను సాధించడానికి ఎంతగానో తోడ్పడింది.

 

45 ఏళ్ల అంకమ్మ ఎస్టీ (షెడ్యూల్డ్ తెగ) వర్గానికి చెందినవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకునే అవకాశం లేకపోవడంతో ఆమె చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి చెత్త ఏరుకునే పనికి వెళ్లేవారు. తక్కువ ఆదాయం, కష్టతరమైన జీవన పరిస్థితులు, సామాజిక బహిష్కరణ కారణంగా ఆమె కుటుంబం ఇంటి అవసరాలను తీర్చుకోవడం లేదా అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయడం చాలా కష్టమైంది.

 

అంకమ్మ వారంలో ఆరు రోజులు పని చేస్తూ చెత్త ఏరుకోవడం ద్వారా రోజుకు సుమారు రూ. 150–200 సంపాదించేవారు. తన కుటుంబ జీవన పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని, మరింత నమ్మకమైన ఆదాయ వనరును ఏర్పాటు చేసుకోవాలని ఆమె ఎంతో అనుకునేవారు. 

 

2023 జూన్ 19న 'స్వచ్ఛతా ఉద్యమి యోజన' (ఎస్‌యూవీ) కింద ఐదుగురు సభ్యుల గ్రూప్ ప్రాజెక్ట్‌లో భాగంగా నవజీవన్ ఆర్గనైజేషన్ ద్వారా అంకమ్మకు సహాయం లభించింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ. 49,96,925 కాగా ఇందులో రూ. 31,22,695 రుణం, రూ. 18,74,230 ముందస్తు మూలధన రాయితీగా ఉన్నాయి. ఈ సహాయం ఆమె మెరుగైన జీవనోపాధి అవకాశాలను పొందడానికి తోడ్పడింది. 

 

ఈ పథకం ద్వారా తనకు లభించిన సహాయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన అంకమ్మ.. "నెలకు అదనంగా సుమారు రూ. 10,000 ఆదాయం వస్తుండటంతో నా కుటుంబ ఆర్థిక భద్రత మరింత బలపడింది" అని అన్నారు. 

ఈ ఆర్థిక సహాయం తర్వాత ఆమెకు నెలకు అదనంగా సుమారు రూ. 10,000 ఆదాయం సమకూరుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ సహాయానికి ముందు, ఆ తర్వాత వచ్చిన ఆదాయాలను పరిశీలిస్తే ఆమె నెలవారీ సంపాదన సుమారు రూ. 8,000 నుంచి రూ. 18,000కి పెరిగింది. దీనివల్ల ఆమె ఇప్పుడు ఇంటి ఖర్చులను మరింత సౌకర్యవంతంగా నిర్వహించగలుగుతున్నారు. దీనితో పాటు భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోగలుగుతున్నారు.

 

అంకమ్మ, ఆమె కుటుంబానికి ఈ ఆదాయ వృద్ధి మరింత స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టింది. చెత్త ఏరుకునే వారికి తగిన ఆర్థిక సహాయం అందిస్తే అది వారి జీవనోపాధిని బలోపేతం చేసి దైనందిన జీవిత పరిస్థితులను ఎలా మెరుగుపరుస్తుందనేందుకు ఆమె ప్రయాణం ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2315128) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी