రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భుజ్, బరౌనీ మధ్య వారానికి మూడుసార్లు నడిచే కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న భారతీయ రైల్వే


గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను కలుపుతూ 2,532 కి.మీ. మేర ప్రయాణించే కొత్త సర్వీసు

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2026 12:03PM by PIB Hyderabad

గుజరాత్‌లోని భుజ్, బీహార్‌లోని బరౌనీ మధ్య వారానికి మూడు సార్లు నడిచే కొత్త సర్వీసును ప్రారంభించడానికి భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ కొత్త సర్వీసు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 2,532 కి.మీ. మేర ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతుంది.

వారానికి మూడు రోజులు నడిచే సర్వీసు

రైలు నెం.19427 భుజ్-బరౌనీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ భుజ్ వద్ద 17:30 గంటలకు బయలుదేరి 04:05 గంటలకు బరౌనీకి చేరుకుంటుంది. అదే విధంగా రైలు నెం.19428 బరౌనీ- భుజ్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ బరౌనీలో 23:55కు బయలుదేరి  భుజ్‌కు 13:15 గంటలకు చేరుకుంటుంది.

సోమ, బుధ, శనివారాల్లో భుజ్-బరౌనీ సర్వీసు నడుస్తుంది. మంగళ, గురు, శనివారాల్లో బరౌనీ-భుజ్ సర్వీసు నడుస్తుంది.

అనుసంధానమయ్యే ప్రధాన స్టేషన్లు

ఈ కొత్త రైలు సర్వీసుకు మార్గమధ్యంలో పలు కీలక స్టేషన్లలో వాణిజ్య స్టాపులు ఉన్నాయి. వీటిలో సమాఖియాలీ, అహ్మదాబాద్, రత్లాం, కోటా, సవాయ్ మాధోపూర్, గంగాపూర్ సిటీ, భరత్‌పూర్, మథుర, హథ్రాస్, బరేలీ, ఇజ్జత్‌నగర్, పిలిభిత్, లఖింపూర్, గోండా, గోరఖ్‌పూర్, సివాన్, ఛప్రా, హాజీపూర్, ముజఫర్‌పూర్, సమస్తిపూర్ తదితర ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి.

దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల మధ్య అదనపు రైలు ప్రయాణ మార్గాన్ని ఈ కొత్త రైలు సర్వీసు కల్పిస్తుంది. అలాగే గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2314802) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada