ఆర్థిక మంత్రిత్వ శాఖ
బంగారం అక్రమ రవాణాపై డీఆర్‌ఐ మెరుపు దాడులు.. రూ.32 కోట్ల విలువైన సుమారు 21 కిలోల విదేశీ బంగారం స్వాధీనం
పొరుగు దేశాల నుంచి అక్రమంగా తరలించిన బంగారం స్వాధీనం.. అయిదుగురు అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 9:13PM by PIB Hyderabad
బంగారం అక్రమ రవాణాపై రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్‌ఐ) నిరంతరంగా దాడులు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏడు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించగా.. రెండు ఆపరేషన్లలో సుమారు 21 కిలోల విదేశీ మూలాలున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ బంగారం మొత్తం విలువ రూ.61 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కస్టమ్స్ చట్టం 1962లోని నిబంధనల కింద అయిదుగురిని అరెస్టు చేశారు.
పక్కా సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు పాల్వాల్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కొత్త థార్ వాహనాలను అడ్డుకున్నారు. రెండు వాహనాల చాసిస్‌లో అత్యంత చాకచక్యంగా, అధునాతన పద్ధతిలో రహస్య అరలను ఏర్పాటు చేశారు. వెనుక చక్రం పైభాగంలో చాసిస్‌లోని కొంత భాగాన్ని తొలగించి, అందులో రహస్య అరను ఏర్పాటు చేసిన అనంతరం తిరిగి నైపుణ్యంతో వెల్డింగ్ చేయడంతో ఈ అరను గుర్తించడం అత్యంత కష్టంగా మారింది. ఈ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం డీఆర్‌ఐ అధికారులు రహస్య అరను విజయవంతంగా గుర్తించగలిగారు. రెండు వాహనాల నుంచి మొత్తం 15.18 కిలోల బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.23.30 కోట్లు ఉంటుంది. వాహనాలతో పాటు ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. ఈ బంగారాన్ని మయన్మార్ నుంచి అక్రమంగా రవాణా చేసినట్లు తెలుస్తోంది.
అంతకుముందు 16.09.2026న నిర్వహించిన మరో ఆపరేషన్‌లో డీఆర్‌ఐ అధికారులు జేవర్ టోల్ ప్లాజా వద్ద గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీకి బస్సులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతడిని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా, ప్రత్యేకంగా రూపొందించిన కాటన్ నడుము బెల్ట్‌లో దాచిన 5.8 కిలోల విదేశీ మూలాలున్న బంగారం లభించింది. ఇందులో ఒక్కొక్కటి కిలో బరువున్న అయిదు బంగారు కడ్డీలు, సుమారు 800 గ్రాముల బంగారు ముక్కలు ఉన్నాయి. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం 1962 కింద ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ బంగారాన్ని ఖాట్మండులో అతడికి అప్పగించి, భారత్–నేపాల్ భూ సరిహద్దు ద్వారా భారత్‌లోకి తీసుకువచ్చినట్లు వెల్లడైంది.
గత మూడు వారాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ ఆపరేషన్లలో డీఆర్‌ఐ అధికారులు సుమారు 123 కిలోల బంగారం, సుమారు 10 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.187 కోట్లకు పైగా ఉంటుంది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి 58 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లు వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణా వ్యవస్థలను ఛేదించడంతో పాటు, మరింత అధునాతనంగా అనుసరిస్తున్న దాచే పద్ధతులను గుర్తించడంపై డీఆర్‌ఐ నిరంతరం దృష్టి సారిస్తున్నదనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2314339)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5