బొగ్గు మంత్రిత్వ శాఖ
‘స్పెషల్ క్యాంపెయిన్ 6.0' కింద 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని శుభ్రం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న ఎంసీఎల్
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 8:02PM by PIB Hyderabad
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) 'స్పెషల్ క్యాంపెయిన్ 6.0' కోసం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమ సమయంలో కార్యాలయాలు, కాలనీలు, ఇతర ప్రాంగణాలలో 10 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని శుభ్రం చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.
గత క్యాంపెయిన్ సమయంలో గుర్తించిన ప్రాంతాల్లో 6.12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఎంసీఎల్ శుభ్రం చేసింది. దీనిని బట్టి చూస్తే ఈ సారి లక్ష్యం చాలా ఎక్కువగా ఉంది. మరింత పరిశుభ్రమైన, వ్యవస్థీకృత, సమర్థవంతమైన కార్యాలయాలను తయారుచేయటం పట్ల కంపెనీకి ఉన్న నిరంతర కృషిని ఇది తెలియజేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ 'స్పెషల్ క్యాంపెయిన్ 6.0'కు అనుగుణంగా ఎంసీఎల్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. 2026 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు జరగనున్న ఈ క్యాంపెయిన్ స్వచ్ఛతను సంస్థాగతం చేయడం, కార్యాలయ నిర్వహణను మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం, పెండింగ్‌లో ఉన్న పనులను తగ్గించడం.. ఈ-వేస్ట్‌తో సహా వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించడం, వేరు చేయడం, పారవేయడంపై దృష్టి సారిస్తుంది.
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) కార్యాలయాలు, ప్రాంగణాల్లో ఉత్పత్తయ్యే ఈ-వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణే ఈ ఏడాది కార్యక్రమంలోని ప్రధాన అంశం.
వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా పనికిరాని, నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించడం, వేరు చేయడం, క్రమబద్ధంగా పారవేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యాలయాలను మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, వ్యవస్థీకృత పని ప్రదేశాలుగా తీర్చిదిద్దడంతో పాటు బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ విధానాలను బలపరచడమే ఈ కార్యక్రమానికి ఉన్న ముఖ్య ఉద్దేశం.
అవాంఛిత, పనికిరాని, నిరుపయోగంగా మారిన సామగ్రిని గుర్తించి తొలగించడం ద్వారా కార్యాలయ స్థలాలను మెరుగ్గా ఉపయోగించుకోవడానికి వీలుగా కార్యాయల స్థల ఆప్టిమైజేషన్‌కు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
'స్పెషల్ క్యాంపెయిన్ 6.0' ద్వారా ఎంసీఎల్ తన కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ పరిశుభ్రత, పర్యావరణ బాధ్యత, సమర్థవంతమైన కార్యాలయ నిర్వహణ సంస్కృతిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2313712)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10