ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసిన ప్రధాన మంత్రి


పద్మ విభూషణ్ యతికుల చక్రవర్తి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ శతజయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 22 SEP 2026 9:03PM by PIB Hyderabad

కర్ణాటకలోని ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ, ఇతర ప్రముఖులను ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలిశారు. 

పద్మ విభూషణ్ యతికుల చక్రవర్తి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ శతజయంతి ఉత్సవాల లోగోను ప్రధాని ఆవిష్కరించారు. భక్తి, అభ్యసన, సేవాభావంతో కూడిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఆయన ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకువెళ్తాయని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"కర్ణాటకలోని ఉడిపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ, ఇతర ప్రముఖులను కలిశాను. 

పద్మ విభూషణ్ యతికుల చక్రవర్తి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ శతజయంతి ఉత్సవాల లోగోను ఆవిష్కరించాను. భక్తి, అభ్యసన, సేవాభావంతో కూడిన ఆయన జీవితం లెక్కలేనంత మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఆయన ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకువెళ్తాయి."

 

***


(రిలీజ్ ఐడి: 2313710) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam