జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిపార్ట్‌మెంటల్ సదస్సుకు కొనసాగింపుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలి వర్చువల్ సమావేశం నిర్వహించిన డీడీడబ్ల్యూఎస్

జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా గ్రామీణ నీటి నిర్వహణ సిబ్బంది నైపుణ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యం

గ్రామీణ నీటి సేవా పంపిణీ నిరంతర నిర్వహణకు అవసరమైన నిపుణులు, స్థానికంగా అందుబాటులో ఉండే మానవ వనరులను నిర్మించడానికి నల్ జల్ మిత్ర, సుజలాం శక్తి కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 8:21PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ (జేజేఎం) 2.0 పరిధిలో సుస్థిర కార్యకలాపాలు, నిర్వహణ (ఓ అండ్ ఎం), నీటి నాణ్యతా పర్యవేక్షణ, గ్రామీణ తాగునీటి మౌలిక వసతుల దీర్ఘకాలిక పనితీరును బలోపేతం చేసే ప్రణాళికను చర్చించేందుకు జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) మొదటి జాతీయ వర్చువల్ కాన్ఫరెన్స్‌ను ఈ రోజు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలు దీనిలో పాల్గొన్నాయి. డిపార్ట్‌మెంటల్ సదస్సుకు (2026 సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించిన) కొనసాగింపుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు

రాష్ట్రాల నీరు, పారిశుద్ధ్య మిషన్లు, ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగాలు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్లు, గ్రామీణాభివృద్ధి విభాగాలు, పంచాయతీరాజ్ సంస్థలు, సాంకేతిక విద్యా విభాగాలు, నైపుణ్యం, సాంకేతిక విద్యలో పనిచేస్తున్న భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను ఈ కాన్ఫరెన్స్ ఒకే వేదిక పైకి తీసుకువచ్చింది.

డీడీడబ్ల్యూఎస్ సెక్రటరీ శ్రీ అశోక్ కేకే మీనా ప్రారంభోపన్యాసనం చేశారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనపైనే కాకుండా గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల కార్యకలాపాలు, నిర్వహణ, పర్యవేక్షణకు అవసరమైన శిక్షణ పొందిన, నైపుణ్యాలున్న మానవ వనరుల అందుబాటులో ఉండటంపై జల్ జీవన్ మిషన్ దీర్ఘకాలిక విజయం ఆధారపడి ఉంటుందన్నారు. గ్రామాల్లో సురక్షితమైన, విశ్వససనీయమైన తాగునీటి సేవలను కొనసాగించేందుకు పటిష్టమైన, సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

నల్ జల్ మిత్ర (నల్ జల్ మిత్ర) కార్యక్రమ ప్రారంభంపై ఈ సదస్సులో ప్రధాన దృష్టి సారించారు. నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, ఎన్‌సీవీటీఈ సహకారంతో గ్రామీణ తాగునీటి వ్యవస్థల కోసం ఎన్ఎస్‌క్యూఎఫ్‌కు అనుగుణంగా ఉన్న నల్ జల్ మిత్ర కార్యక్రమాన్ని డీడీడబ్ల్యూఎస్ అభివృద్ధి చేసిందని తెలియజేశారు. గ్రామీణ తాగు నీటి సరఫరా మౌలిక సదుపాయాల సాధారణ కార్యకలాపాలను, ముందస్తు నిర్వహణ, ప్రాథమిక మరమ్మతులను చేపట్టే సామర్థ్యం ఉన్న బహుళ నైపుణ్యాలున్న సాంకేతిక నిపుణులను గ్రామీణ స్థాయిలో తయారు చేయడమే ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం. దీనిలో  పంపులు, పైపులైన్లు, శుద్ధి వ్యవస్థలు, విద్యుత్ కనెక్షన్లు, ఇతర అనుబంధ మౌలికవసతులకు సంబంధించిన నైపుణ్యాలుంటాయి. జేజేఎం 2.0 పరిధిలో గ్రామీణ తాగునీటి వ్యవస్థలను నిర్వహించేందుకు నైపుణ్య శ్రామిక శక్తిని నిర్మించాలన్న డీడీడబ్ల్యూఎస్ వ్యూహంలో ఈ కార్యక్రమం ముఖ్యమైన అంశంగా ఉంది.

ఈ కార్యక్రమం పరిధిలో నిర్వహిస్తున్న  రెండు శిక్షణా కార్యక్రమాల గురించి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించారు. అవి కొత్త వారి కోసం 510 గంటల షార్ట్ టర్మ్ శిక్షణా కోర్సు, ఇప్పటికే గ్రామీణ తాగునీటి వ్యవస్థల్లో ఆపరేటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు అటెండెంట్లు, ఇతర సిబ్బందిగా పనిచేస్తున్న వారి కోసం 120–గంటల రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్ (ఆర్‌పీఎల్). గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య మానవ వనరునలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, ఉపాధి అవకాశాల కల్పనకు ఈ రెండు విధానాలను సద్వినియోగం చేసుకోవాలని, దీనిలో స్థానిక యువతకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రాలకు సూచించారు.
ఆమోదించిన అర్హతల స్వీకరణ ప్రక్రియను ఎన్‌సీవీటీఈ ప్రతినిధులు వివరించారు. శిక్షణ, మూల్యాంకనం, ధ్రువీకరణను అందించే గుర్తింపు పొందిన సంస్థలుగా మారేందుకు ఉన్న అవకాశాలను రాష్ట్రాలకు తెలియజేశారు. పీఎంకేవీవై 4.0 పరిధిలో లభించే అవకాశాల గురించి నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వివరించింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మిషన్లు, ఐటీఐలు, పాలీటెక్నిక్ కళాశాలలు, ఇతర ప్రభుత్వ శిక్షణా సంస్థల సమన్వయంలో జిల్లా స్థాయి శిక్షణా ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
విస్తరిస్తున్న గ్రామీణ తాగునీటి రంగం స్థానికంగా ఉపాధి కల్పనకు ప్రధాన వనరుగా మారుతోందని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విభాగం తెలియజేసింది. టెక్నీషియన్లు, ఆపరేటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియను, పంప్ మెకానిక్‌లు, ప్రయోగశాల సిబ్బంది, సూపర్‌వైజర్లు, నీటి నాణ్యత సిబ్బందితో సహా భవిష్యత్తులో తాగునీటి సరఫరా వ్యవస్థ కార్యకలాపాలు, నిర్వహణకు 13 లక్షలకు పైగా సిబ్బంది అవసరమని అంచనాలు చెబుతున్నాయి. భవిష్యత్తు శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా నైపుణ్య కార్యక్రమాలుండాలని రాష్ట్రాలకు సూచించారు. దీనివల్ల మౌలిక వసతుల్లో పెట్టుబడులను గ్రామీణ యువతకు సుస్థిరమైన జీవనోపాధి అవకాశాలుగా మారతాయని వివరించారు.

నీటి నాణ్యతను పర్యవేక్షించడం, పరీక్షించడం, ప్రాథమిక శుద్ధి కోసం శిక్షణ పొందిన గ్రామీణ స్థాయి మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా మహిళల నేతృత్వంలోని కార్యక్రమమైన సుజలాం శక్తి ప్రారంభం గురించి ఎన్‌జేజేఎం సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వాతి మీనా నాయక్ వివరించారు. గ్రామీణ స్థాయిలో తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి సమాజ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం. అదే సమయంలో గ్రామీణ నీటి నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.

‘‘ఫండమెంటల్స్ ఆఫ్ బేసిక్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్’’ అనే ఎన్ఎస్‌క్యూఎఫ్ లెవెల్–2 కోర్సు ఆదారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు సమావేశంలో ఆమె తెలియజేశారు. సరైన పద్ధతిలో నీటి నమూనాల సేకరణ, ఫీల్డ్ టెస్ట్ కిట్స్ (ఎఫ్‌టీకే) ఉపయోగించడం, ప్రాథమిక క్లోరినేషన్, శుద్ధి ప్రక్రియలు, పారిశుద్ధ్య తనిఖీలు, వనరుల భద్రత, నిర్వహణ నమోదు, డిజిటల్ రిపోర్టింగులో మహిళలకు నైపుణ్యాలను ఈ కార్యక్రమం అందిస్తుందన్నారు. మొదటి దశలో దాదాపుగా లక్షా ముప్ఫయ్ అయిదు వేల మంది మొదలు లక్షా డెబ్భయ్ వేల మంది మహిళలకు శిక్షణను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీని కోసం స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లు, పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ)లతో పాటు ఇతర శిక్షణ సంస్థల సాయాన్ని తీసుకుంటామని ఆమె తెలిపారు.
గ్రామీణ జల రంగానికీ, సాంకేతిక విద్యకూ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంపైన కూడా చర్చించారు. ఈ సందర్భంగా డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులకు నీటి సరఫరా నిర్వహణపై ఒక ప్రత్యేక కోర్సును రూపొందించడం ఎంతవరకు వచ్చిందో ఏఐసీటీఈ తెలిపింది. ఈ కోర్సులో గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించిన ఆచరణాత్మక అనుభవంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
రాబోయే కాలపు జల రంగ పాఠ్య ప్రణాళిక, శిక్షణ కార్యక్రమాలలో సరికొత్త సాంకేతికతలను చేర్చడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఐఐటీ కాన్పూర్ తెలిపింది.  చర్చలలో ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు, టెలీమెట్రీ, ఎస్‌సీఏడీఏ, జీఐఎస్ సేవలు, ముందుగా ఊహించగలిగిన మరమ్మతులకు పనికివచ్చే ఉపకరణాలు, మెషీన్ లెర్నింగ్, డేటా ఆధారితంగా పనిచేసే నిర్ణయ సహాయక వ్యవస్థల పాత్ర అంతకంతకూ విస్తరిస్తుండడం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టారు. భవిష్యత్తులో సాంకేతిక విద్య, శిక్షణకు ఉద్దేశించిన కార్యక్రమాల్లో ఇలాంటి మెలకువలను మరిన్ని చేర్చాలనీ, అలా చేస్తే నవ తరం జల రంగ వృత్తినిపుణులను సన్నద్ధులను చేయవచ్చనీ చర్చలలో పాలుపంచుకున్న వారు అభిప్రాయపడ్డారు.  
జిల్లా వారీగా మానవ వనరుల అవసరాలను అంచనా వేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చారు. ఆ అంచనా.. వాస్తవిక మౌలిక సదుపాయాలు, కార్యనిర్వహణ సంబంధిత అవసరాల ఆధారంగా ఉండాలి. దానిలో జల శుద్ధి ప్లాంటులు, పంపింగ్ స్టేషన్లు, సరఫరా వ్యవస్థలు, జలాశయాలు, పంపిణీ నెట్‌వర్కులు, నీటి నాణ్యత నిర్ధారణకు ప్రయోగశాలల సమాచారం కూడా జతపడి ఉండాలని తెలిపారు. ఈ అంచనాలు సిబ్బంది కొరతను గుర్తించడానికీ, ఎంత మందికి శిక్షణను ఇవ్వాల్సి ఉంటుందో తెలుసుకోవడానికీ ఉపయోగపడతాయి. ఈ కింది కార్యాచరణ అంశాలను నిర్ణీత కాలంలో ముగించాల్సి ఉంటుందని రాష్ట్రాలకు/కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేశారు:
     • 
ఇప్పుడున్న నల్ జల్ మిత్ర (జల్ వితరణ్ సంచాలక్) కోర్సును అనుసరించడమా, లేక రాష్ట్ర వారీ అవసరాలను లెక్కలోకి తీసుకొని వేరే కోర్సును రూపొందించడమా అనే విషయంలో ఒక నిర్ణయాన్ని రాష్ట్రాలు లేదా ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్ 2026 అక్టోబర్ 15 లోపల తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాన్ని తీసుకున్న తరువాత, పురస్కార ప్రదానం చేసే సంస్థ (అవార్డింగ్ బాడీ)గా రాష్ట్రం ఉండదలుచుకుందనే ప్రతిపాదననూ ఎన్‌సీవీఈటీకి సమర్పించాలి.
     •   
పీఎమ్‌కేవీవైలో భాగంగా ఎస్‌టీటీ లేదా ఆర్‌పీఎల్‌ల కోసం ఎస్ఎస్‌డీఎమ్, లేదా మరేదైనా సముచిత సంస్థను కార్యక్రమ అమలు ఏజెన్సీ (ప్రోగ్రాం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ.. పీఐఏ)గా ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్ నామినేట్ చేయవచ్చు. ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్, ఎస్ఎస్‌డీఎమ్‌లకు అక్టోబర్ 5 లోపు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎంత మందికి నైపుణ్య శిక్షణనివ్వాలన్న లక్ష్యాన్ని ఈ సమావేశంలో ఖరారు చేస్తారు.
      •   
శిక్షణను ఇవ్వాల్సి ఉన్న అభ్యర్థుల సంఖ్యను ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్ ఖాయం చేయాలి. నామినేషన్లను గ్రామ పంచాయతీల ద్వారా పంపించాల్సి ఉంటుంది.
      •   
పీఎమ్‌కేవీవై మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కలిగివున్న ఐటీఐలను గుర్తించాల్సిందిగా డీడబ్ల్యూఎస్ఎమ్‌‌లకు ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్ ఆదేశించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్ని సరిచూసే బాధ్యత డీడబ్ల్యూఎస్ఎమ్‌దే. అవసరపడే ఏ సహాయాన్ని అయినా ఎస్ఎస్‌డీఎమ్ లేదా గుర్తించిన పీఐఏ సమకూర్చవలసి ఉంటుంది.
     •   
గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ విభాగాలతో కలిసి జేజేఎమ్ 2.0 మార్గదర్శక సూత్రాలు, సీఐఆర్‌పీలో భాగంగా అవసరమైన ముసాయిదా హెచ్ఆర్ పాలసీని రాష్ట్రాలు రూపొందించాల్సి ఉంటుంది.
     •   
గ్రామ పంచాయతీ (జీపీ), బ్లాకు, జిల్లా స్థాయులలో  ఓ అండ్ ఎమ్ మ్యాన్‌పవర్ లోటును గుర్తించడానికి గాను హెచ్ఆర్‌ సంబంధిత అంచనాను డీడబ్ల్యూఎస్ఎమ్‌తో కలసి ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్ చేపడుతుంది.
     •   ‘
సుజలం శక్తి’ సభ్యులను రాష్ట్రాలే గుర్తించి, గ్రామ పంచాయతీ డ్యాష్‌బోర్డు వేదికలో నమోదు చేసేందుకు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది.
అనేక రాష్ట్రాలు తమ అనుభవాలను, తాము అనుసరిస్తున్న మంచి పద్ధతులను సమావేశంలో ప్రస్తావించాయి. స్థానికంగా మెకానిక్కులకు, ‘నల్ జల్ మిత్ర’లకు, నీటి నాణ్యతను పరీక్షించే పనిని చూసే మహిళలకు శిక్షణను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఒడిశా వివరించింది. శ్రమశక్తి అవసరాలను అంచనా వేసేందుకు తోడ్పడే వనరుల ఆధారిత పద్ధతిని తెలంగాణ తెలియజేసింది. జమ్మూ, కాశ్మీర్ తన విశిష్ట భౌగోళిక పరిస్థితులకు అనువుగా ఉన్న శ్రమశక్తి ప్రణాళికకు సంబంధించి అనుసరిస్తున్న పథకాన్ని వివరించింది. ‘సుజలం శక్తి’ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని అమలుచేయడానికి గ్రామీణాభివృద్ధి రాష్ట్ర సంస్థ (ఎస్ఐఆర్‌డీ)తో పాటు ఎక్స్‌టెన్షన్ ట్రయినింగ్ సెంటర్స్ అండ్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రయినింగ్ ఇనిస్టిటట్యూట్స్ (ఆర్ఎస్ఈటీఐస్) సేవలను వినియోగించుకుంటున్నట్లు మధ్యప్రదేశ్ తెలిపింది. అభ్యర్థుల గుర్తింపు, సంస్థాగత సమన్వయం, సర్టిఫికేషన్, శ్రమశక్తి వినియోగంతో ముడిపడిన ప్రయత్నాలను హర్యానా, పంజాబ్ వివరించాయి.
పటిష్ఠమైన నైపుణ్య సాధన విస్తారిత అనుబంధ వ్యవస్థను అభివృద్ధిపరిచినప్పుడు అది ఒక్క గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, మరమ్మతు ప్రక్రియలను బలపరచడమొక్కటే కాకుండా, పల్లెల్లో నిరంతర ఉపాధికల్పన అవకాశాలను కూడా అందిస్తుందని సమావేశంలో ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్‌లో భాగంగా పెట్టిన పెట్టుబడులను పరిరక్షించడానికీ, దీర్ఘకాలిక ప్రాతిపదికన జల భద్రతను నిర్ధారించడానికీ సుశిక్షితులైన ఆపరేటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, పంప్ మెకానిక్కులు, నీటి నాణ్యతను సరిచూసే వారు, తదితర సాంకేతిక వృత్తినిపుణుల సేవలు కీలకంగా మారనున్నాయి.
ముందున్న మార్గాన్ని నేషనల్ జల్ జీవన్ మిషన్ (ఎన్‌జేజేఎమ్) అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టరు శ్రీ కమల్ కిశోర్ సోన్ వివరించారు.
సంబంధిత విభాగాలు, సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలనీ, జిల్లా వారీ హెచ్ఆర్ మ్యాపింగ్ చేయాలనీ, ట్రయినింగ్ భాగస్వాములను గుర్తించాలనీ, ‘నల్ జల్ మిత్ర’తో పాటు ‘సుజలమ్ శక్తి’ అర్హతలను సాధించే వేగాన్ని పెంచాలనీ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన పిలుపిచ్చారు. శిక్షణ పొందిన సిబ్బందికి విధులను అప్పగించడానికీ, పారితోషికంతో పాటు పనితీరును పర్యవేక్షించడానికీ యంత్రాంగాల్ని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

మౌలిక సదుపాయాల కల్పన మొదలు నిరంతర సేవల అందజేత దిశగా పయనించడాన్ని జల్ జీవన్ మిషన్ 2.0 సూచిస్తోందని సమావేశం ముగింపులో శ్రీ సోన్ పునరుద్ఘాటించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి మౌలిక సదుపాయాలను విశ్వసనీయ పద్ధతిలో నిర్వహించడం, ఎప్పటికప్పుడు తగిన మరమ్మతులను చేపట్టడంతో పాటు రాబోయే తరాల వారికి సురక్షిత తాగునీటి సేవలు అందేటట్లు చూడాలంటే అందుకు వృత్తి నైపుణ్యం, స్థానికంగా అందుబాటులో ఉండే సిబ్బందిని సన్నద్ధుల్ని చేయడం ముఖ్యమని ఆయన అన్నారు. దేశమంతటా గ్రామీణ జల భద్రతనీ, ఉపాధికల్పననీ ప్రోత్సహించడానికి నైపుణ్య సాధనతో ముడిపడిన కార్యాచరణ ప్రణాళికను తక్షణ ప్రాతిపదికన నిబద్ధతాపూర్వకంగా అమలుపరచడానికి ముందుకు రావలసిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ సోన్ విజ్ఞప్తి చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2313458) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी