ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలు: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన సూచికా తారియల్.. ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
22 SEP 2026 1:58PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సూచికా తారియాల్ గెలిచిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెను ఈ రోజు అభినందించారు. ఈ గెలుపు భారత్‌కు చరిత్రాత్మక విజయమని ప్రధానమంత్రి అన్నారు.
ఈ రంగంలో భారత్‌కు మొదటి ఆసియా క్రీడల పతకాన్ని సూచికా తారియాల్ సంపాదించి పెట్టారని ప్రధానమంత్రి అన్నారు. ఆమె సాధించిన విజయం చాలా ప్రత్యేకమైందనీ, అది ఆమె అంకితభావానికీ, పట్టుదలకీ అద్దంపడుతోందనీ ఆయన అన్నారు. రాబోయే కాలంలో సూచిక మరిన్ని విజయాలను సాధించాలంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా పేర్కొంది:
‘‘భారత్‌కు మరో చరిత్రాత్మక విజయం.
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సూచికా తారియాల్‌కు అభినందనలు. ఆసియా క్రీడల్లో ఈ రంగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించారామె. ఆమె గెలుపు ఎంతో ప్రత్యేకమైంది. ఇది ఆమె అంకితభావాన్నీ, అభినివేశాన్నీ చాటుతోంది.
రాబోయే కాలంలో మరిన్ని విజయాలను సూచిక అందుకోవాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’’.
***
(రిలీజ్ ఐడి: 2313447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam