యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్.. 1,000 ప్రాంతాల నుంచి 4 లక్షల మందికి పైగా పాల్గొన్న యువత
నాడు పోస్టు చేయడమైనది:
20 SEP 2026 9:58PM by PIB Hyderabad
వికసిత్ భారత్ లక్ష్య సాధన క్రమంలో నషా ముక్త్ యువా ఆశయంతో, 100 వారాల పాటు నషా ముక్త్ యువా అభియాన్‌ను భారతదేశమంతలా 1,000కి పైగా ప్రాంతాలలో నిర్వహించారు. ఈ ఉద్యమంలో యువతీ యువకులు, పౌరులు మొత్తం 4 లక్షల కన్న ఎక్కువ మంది పాల్గొన్నారు. నషా ముక్త్ భారత్ (మత్తు పదార్థాలకు చోటుండని భారత్)ను ఆవిష్కరించే దిశగా ఉమ్మడి నిబద్ధతను ప్రకటించడానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానించిన ఈ కార్యక్రమంలో, యువజనులతో పాటు భాగస్వామ్య సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నాయి.
నషా ముక్త్ యువా ప్రచార ఉద్యమంలో యువతతో పాటు పౌరులు పాల్గొనడానికి వీలుగా, ఈ కార్యక్రమాన్ని 460 మై భారత్ జిల్లాలలో మై భారత్‌కు చెందిన భాగస్వామ్య సంస్థలకు చెందిన 240 ప్రాంతాల్లో, ఉద్యోగ సంఘాలు, విశ్వవిద్యాలయాల సంఘాల ఆధ్వర్యంలో 300 కన్న ఎక్కువ ప్రాంతాల్లో నిర్వహించారు.
ఉమ్మడి సంకల్పం, యువత నాయకత్వంలో భాగస్వామ్యం అన్న భావనలను ఆధారం చేసుకొని ‘రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్’ను నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారు నషా ముక్త్ ప్రతిజ్ఞను స్వీకరించడంతో పాటు సంతకాలు కూడా చేశారు. యువత సారథ్యంలో చర్చలను, చైతన్య కార్యక్రమాలను, ఇతర స్థానిక కార్యక్రమాలతో పాటు, సృజనాత్మకత, భాగస్వామ్యం ప్రధానంగా ఉండే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మాదకద్రవ్యాల అలవాటుకు దూరంగా జీవన శైలిని అలవరుచుకోవాలన్న సందేశాన్ని ప్రజల చెంతకు మరింత ప్రభావవంతంగా తీసుకుపోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వికసిత్ భారత్ లక్ష్యానికి దోహదం చేసే నషా ముక్త్ భారత్ ప్రచార ఉద్యమంలో యువజనులు, భాగస్వామ్య సంస్థలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చైతన్యాన్ని పెంపొందింపచేయడం, మాదకద్రవ్యాల ఉపయోగాన్ని నివారించడం, ఆరోగ్యంగా ఉండడానికి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం, యువత సకారాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడం ఈ కార్యక్రమ ధ్యేయాలు. సంకల్ప్ సమారోహ్‌తో సంస్థలను, సంఘాలను, ప్రజలను ఒకే తాటి మీదకు తీసుకువచ్చి, విషయాలను యువత తెలుసుకొని జాగరూకంగా ఉంటూ ఆరోగ్యకర జీవన శైలిని అవలంబించడానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటట్లు చూడడానికి ఉమ్మడి వేదికను అందిస్తున్నారు.
ఈ కార్యక్రమం 100 వారాల పాటు కొనసాగించే నషా ముక్త్ యువా అభియాన్లో ఓ భాగం. దీనిని మాదక ద్రవ్యాల సేవన నివారణ, అవగాహన, ఆరోగ్యం, శరీర దారుఢ్యం, జీవన నైపుణ్యాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు నిలకడతనంతో కూడిన ఒక యువజన ఉద్యమ రూపంలో నిర్వహిస్తున్నారు. మొదటి దశ కార్యకలాపాల్లో ‘నా ఆరోగ్యం’, ‘నా గౌరవం’, ‘ఫిట్ యూత్’ అనే మూడు ఇతివృత్తాలతో పాటు, ‘జీవన నైపుణ్యాల మాసం’ కూడా భాగాలుగా ఉంటాయి. దీని ద్వారా సముదాయ ఆధారిత, యువ ప్రధాన కార్యకలాపాలను నిర్వహించి యువతీయువకుల భాగస్వామ్యాన్ని నిరంతర ప్రాతిపదికన ప్రోత్సహించనున్నారు.
ఈ నెల 18న జన సమీకరణ కోసం వివిధ సంస్థలు, సముదాయాల్లో అనేక కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 20న జాతీయ స్థాయి భాగస్వామ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు చేపట్టిన జనసమీకరణలో ప్రతిజ్ఞలు, సంతకాలు, చర్చ, ప్రజా భాగస్వామ్యం ద్వారా యువతను, పౌరులను సమావేశపరిచారు. దీంతో నిరంతర ప్రచార ఉద్యమానికి బలమైన పునాదిని వేసినట్లయింది.
నషా ముక్త్ భారత్‌ను ఆవిష్కరించడం ఓ సామూహిక ప్రయత్నమని రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ స్పష్టం చేస్తోంది. దీని కోసం యువజనులు, సంస్థలు, సముదాయాల నిరంతర అవగాహన, సకారాత్మక ప్రత్యామ్నాయాలు, చురుకైన భాగస్వామ్యం నెలకొనడం చాలా అవసరం.
వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం నషా ముక్త్ యువా. 100 వారాల నషా ముక్త్ యువా అభియాన్లో భాగంగా యువత నాయకత్వంలో భాగస్వామ్యాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిరంతర ప్రాతిపదికన ముందుకు తీసుకుపోనున్నది. దీని ద్వారా నిరంతర భాగస్వామ్యాన్నీ, సకారాత్మక కార్యాచరణనీ యువత అనుసరించేటట్లు చూస్తూ, ఈ సందేశాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసే విధంగా వారిని ప్రోత్సహించనుంది.
***
(రిలీజ్ ఐడి: 2312872)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4