ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జర్నలిస్టు పాయల్ మెహతా గారి మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 20 SEP 2026 12:09PM by PIB Hyderabad

ప్రముఖ జర్నలిస్టు పాయల్ మెహతా గారి మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా జీ ఎంతో కష్టపడి పనిచేసే, అంకితభావం గల పాత్రికేయురాలన్నారు. ఆమె క్షేత్రస్థాయిలో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ, జాతీయ సమస్యలపై లోతైన అవగాహనతో వార్తాంశాలను అందించే వారని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. "ఆమె ఆప్యాయత, కరుణ, తన చుట్టూ ఉన్నవారితో పంచుకున్న వ్యక్తిగత అనుబంధంతో ఆమె చిరస్మరణీయులు" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎక్స్వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

పాయల్ మెహతా గారు కష్టపడి పనిచేసే జర్నలిస్టు. జాతీయ సమస్యలపై లోతైన అవగాహన, క్షేత్రస్థాయితో బలమైన అనుబంధంతో ఆమె వార్తలను అందించేవారు.

వృత్తిపరమైన జీవితంతో పాటు, వ్యక్తిగతంగానూ ఎందరో జీవితాలను తన కరుణ, ఆప్యాయతలతో స్పృశించిన ఆమె చిరస్మరణీయులు. ఆమె ఆకస్మిక, అకాల మరణం అత్యంత విచారకరం.

ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట సమయంలో వారికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.

 

***


(రిలీజ్ ఐడి: 2312834) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam