రైల్వే మంత్రిత్వ శాఖ
శావల్యాపురం-గుంటూరు విభాగంలో 73 ఆర్‌కేఎం మేర విద్యుత్ రైల్వే వ్యవస్థను 2X25 కేవీకి ఆధునీకరించేందుకు రూ.142 కోట్లతో ఆమోదం తెలిపిన భారత రైల్వే
దక్షిణ కోస్తా రైల్వేలోని కీలక మార్గంలో ట్రాక్షన్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు 146 టీకేఎం పరిధిలో ఆధునీకరణ
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2026 3:25PM by PIB Hyderabad
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని శావల్యాపురం - గుంటూరు మధ్య 73 రూట్ కిలోమీటర్ల విద్యుత్ రైల్వే వ్యవస్థను 1x25 కేవీ నుంచి 2x25 కేవీకి ఆధునీకరించేందుకు రూ. 142 కోట్ల అంచనా వ్యయంతో భారత రైల్వే ఆమోదం తెలిపింది. మొత్తం 146 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ ప్రాజెక్టు... ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయటంతో పాటు పెరుగుతున్న రైల్వే కార్యకలాపాలకు మద్దతుగా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శావల్యాపురం - గుంటూరు సెక్షన్‌లో విద్యుత్ రైల్వే వ్యవస్థ ఆధునీకరణ... వాస్కో-గడగ్-గుంతకల్లు-నంద్యాల-శావల్యాపురం-గుంటూరు-విజయవాడ మార్గాన్ని కవర్ చేసే హెచ్‌యూఎన్ రూట్-8లో ఒక భాగం.
శావల్యాపురం-గుంటూరు విభాగంలో ఎలక్ట్రిక్ రైలు సర్వీసుల విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలను, అభివృద్ధి చేసిన ట్రాక్షన్ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తుంది. దీనివల్ల పెరుగుతున్న రద్దీని భారత రైల్వే మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుంది. దీనిద్వారా కీలకమైన హెచ్‌యూఎన్ మార్గం సామర్థ్యాన్ని, విశ్వసనీయతను కూడా పెంపొందిస్తుంది. రైలు సర్వీసులు మరింత సజావుగా సాగేలా చేయటంతో పాటు ఆ ప్రాంతంలోని మొత్తం రైల్వే వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుంది.
ట్రాక్షన్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచటం, భవిష్యత్ రద్దీకి తగినట్లుగా రైల్వే వ్యవస్థను సన్నద్ధం చేయటంపై భారత రైల్వే నిరంతరం దృష్టి సారిస్తుందని ఈ ఆధునీకరణ ప్రతిబింబిస్తుంది.
(రిలీజ్ ఐడి: 2312446)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25