ప్రధాన మంత్రి కార్యాలయం
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 10:51PM by PIB Hyderabad
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
ప్రధానమంత్రి శ్రీ స్కెరిట్.. మీ ఆత్మీయ శుభకామనలకు, డొమినికా ప్రభుత్వంతో పాటు డొమినికా ప్రజల సద్భావనలకు నేను ధన్యవాదాలు పలుకుతున్నాను. పరస్పర ఆప్త మైత్రికి భారత్ అమిత ప్రాధాన్యాన్ని ఇస్తున్నది.
ప్రధానమంత్రి మెలోని గారు.. మీ స్నేహపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. భారత్, ఇటలీల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకోవడానికి మన సన్నిహిత సహకారాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను.
ప్రధానమంత్రి శ్రీ టోబ్‌గే.. మీ ఆప్యాయభరిత శుభాకాంక్షలకు, మంచి మాటలకు ఇవే ధన్యవాదాలు. మీ శుభకామనలను, భావనలను నా మదిలో తప్పక పదిలపరుచుకొంటాను.
డాక్టర్ టెడ్రోస్.. మీరు నా పుట్టిన రోజుకు స్నేహపూర్వక శుభకామనలను వ్యక్తం చేసినందుకు మీకు ఇవే నా ధన్యవాదాలు.
బ్రిక్స్ నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు, ప్రపంచ ఆరోగ్య రంగం సహా వివిధ రంగాల్లో మన ఉమ్మడి నిబద్ధతను ముందుకు తీసుకుపోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది.’’
(రిలీజ్ ఐడి: 2311950)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6