భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

మూడు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఫ్రాంచైజీల కొనుగోలు కోసం వెస్ట్‌వ్యూ క్రికెట్‌ లిమిటెడ్‌, పూనావాలా స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సీసీఐ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 9:21PM by PIB Hyderabad

మూడు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఫ్రాంచైజీలను - i) రాజస్థాన్‌ రాయల్స్‌ (భారత్‌), (ii) పార్ల్‌ రాయల్స్‌ (దక్షిణాఫ్రికా), (iii) బార్బడోస్‌ రాయల్స్‌ (బార్బడోస్‌) లను కొనుగోలు చేసేందుకు వెస్ట్‌వ్యూ క్రికెట్‌ లిమిటెడ్‌, పూనావాలా స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లకు భారత పోటీ నియంత్రణ సంస్థ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా - సీసీఐ) ఆమోదం తెలిపింది.

ప్రతిపాదిత విలీన లావాదేవీ మూడు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఫ్రాంచైజీల కొనుగోలుకు సంబంధించినది. అవి: (i) రాజస్థాన్‌ రాయల్స్‌ (భారత్‌), (ii) పార్ల్‌ రాయల్స్‌ (దక్షిణాఫ్రికా), (iii) బార్బడోస్‌ రాయల్స్‌ (బార్బడోస్‌). ఈ ఫ్రాంచైజీలను వెస్ట్‌వ్యూ క్రికెట్‌ లిమిటెడ్‌ (వెస్ట్‌వ్యూ క్రికెట్‌), పూనావాలా స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పూనావాలా స్పోర్ట్స్‌) కొనుగోలు చేయనున్నాయి.

వెస్ట్‌వ్యూ క్రికెట్‌ బ్రిటన్ లో నమోదైన సంస్థ.

పూనావాలా స్పోర్ట్స్‌ భారత్‌లో ఏర్పాటైన ప్రైవేట్‌ సంస్థ. ఇది శ్రీ అదర్‌ సైరస్‌ పూనావాలాకు పూర్తిగా చెందిన సంస్థ.

ఈఎం స్పోర్టింగ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఈఎంఎస్హెచ్) ) మారిషస్‌లో ఏర్పాటై, నమోదైన షేర్ల ద్వారా పరిమిత బాధ్యత కలిగిన ప్రైవేట్‌ సంస్థ. ఇది రాయల్‌ మల్టీస్పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆర్ఎంపీఎల్) , పార్ల్‌ రాయల్స్‌ లిమిటెడ్‌, బార్బడోస్‌ రాయల్స్‌ లిమిటెడ్‌లకు హోల్డింగ్‌ సంస్థగా ఉంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్ ) టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీని ఆర్ఎంపీఎల్ తన ఆధీనంలో నిర్వహిస్తోంది.

 

****


(రిలీజ్ ఐడి: 2311770) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी