వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ పద్ధతుల పై హైదరాబాద్‌లో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 8:00PM by PIB Hyderabad

సుస్థిర, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో నిర్వహించనుంది. ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వ్యవసాయ నిపుణులు, ఐసీఏఆర్ సంస్థలు, ప్రగతిశీల రైతులు, ఇతర భాగస్వామ్య వర్గాలు పాల్గొననున్నాయి.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రులు శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్, శ్రీ భగీరథ్ చౌధరి ఈ సదస్సుకు హాజరుకానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్-నికోబార్ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు కూడా సదస్సులో పాల్గొంటారు.

డిజిటల్ వ్యవసాయం, రైతు రిజిస్ట్రీ, అధిక విలువ కలిగిన ఉద్యాన పంటలు, విలువ జోడింపు, వంట నూనెలు మరియు పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వావలంబన, ప్రకృతి వ్యవసాయం, సమగ్ర వ్యవసాయ విధానాలు, సమతుల్య ఎరువుల వినియోగం, నకిలీ పురుగుమందులు మరియు ఎరువుల నియంత్రణ వంటి కీలక అంశాలపై సదస్సులో చర్చ జరగనుంది.

దక్షిణాది రాష్ట్రాలు తమ వినూత్న కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను సదస్సులో ప్రదర్శించనున్నాయి. తెలంగాణ రైతునేస్తం, ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ వైవిధ్యాన్ని ఎదుర్కొనే విధానాలు, కర్ణాటకలో పప్పుధాన్యాల ఉత్పత్తి మెరుగుదల పద్ధతులు, కేరళలో సేకరణ మరియు మార్కెట్ కార్యక్రమాలు, తమిళనాడులో ఖచ్చితత్వ వ్యవసాయం, హైటెక్ వ్యవసాయ విధానాలు ఇందులో ప్రదర్శించనున్నారు.

 

కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, విజయవంతమైన కార్యక్రమాలు మరియు ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి, వాటిని ఇతర ప్రాంతాల్లో అమలు చేసేందుకు వీలు కల్పించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాల్లో భాగంగా ఉంది.

 

వ్యవసాయ రంగంలో స్వావలంబన, అధిక విలువ కలిగిన ఉద్యాన పంటల ప్రోత్సాహం, డిజిటల్ మరియు వాతావరణ ప్రతిఘటనశీల వ్యవసాయం, అలాగే నిల్వ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాల రూపకల్పనకు ఈ సదస్సు దోహదపడనుంది.

****


(రిలీజ్ ఐడి: 2311636) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English