రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్: బెంగళూరులో రక్షణ మంత్రి, పౌర విమానయాన మంత్రి సమక్షంలో భారత వైమానిక దళానికి ఎల్‌సీఏ తేజస్ ఎఫ్ఓసీ ట్విన్ సీటర్ శిక్షణ విమానాలు, హెచ్‌టీటీ - 40 బేసిక్ ట్రైనర్ విమానాలనూ, పీహెచ్ఎల్‌కు ధ్రువ్ ఎన్‌జీ హెలికాప్టర్లనూ అందజేయనున్న హెచ్ఏఎల్
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 3:45PM by PIB Hyderabad
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం తయారు చేసిన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ (ఎఫ్ఓసీ) ట్విన్ సీటర్ ట్రైనర్ విమానాలనూ, హెచ్‌టీటీ - 40 బేసిక్ ట్రైనర్ విమానాలనూ, పవన్ హన్స్ లిమిటెడ్ (పీహెచ్ఎల్) కోసం తయారుచేసిన ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లనూ సెప్టెంబర్ 18, 2026న కర్ణాటకలోని బెంగళూరులో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు సమక్షంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) అందజేయనుంది. ఈ విమానాలను, హెలికాప్టర్లను అందజేయడం దేశ స్వావలంబన ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలవనుంది. దేశీయ ఏరోస్పేస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో హెచ్ఏఎల్, దాని పారిశ్రామిక భాగస్వాములు పోషిస్తున్న పాత్రను ఈ కార్యక్రమం చాటిచెప్పనుంది. పౌర, సైనిక అవసరాల కోసం అధునాతన వేదికల రూపకల్పన, అభివృద్ధి, తయారు చేసే సామర్థ్యాన్ని, దేశీయ పరిశ్రమ విస్తరిస్తున్న తీరును కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించనుంది.
వైమానిక దళం ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ ఉత్పత్తుల విభాగం కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, హెచ్ఏఎల్ సీఎండీ శ్రీ కే. రవితో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం, పవన్ హన్స్ లిమిటెడ్, నియంత్రణ సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఏరోస్పేస్, రక్షణ రంగాల భాగస్వాములు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో దేశీయంగా రూపకల్పన, అభివృద్ధి, తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ వేదికలను సాయుధ బలగాలు, సంబంధిత సంస్థల్లో ప్రవేశపెట్టడం దేశీయ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా మరో ముందడుగు.
***
(రిలీజ్ ఐడి: 2311432)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8