పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక క్యాంపెయిన్ 5.0 ద్వారా పౌర విమానయాన మంత్రిత్వశాఖ పురోగతి


సరైన కార్యాలయం, ఫైళ్ల తొలగింపు, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కారానికి భారీ ప్రయత్నం

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 9:58PM by PIB Hyderabad

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు నాయకత్వంలో స్వచ్ఛతను జీవన విధానంగా మలుచుకుంటూ అన్ని విభాగాల్లో మంత్రిత్వ శాఖ గణనీయమైన పురోగతిని సాధించింది. ఎయిర్‌సేవా, సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్స్ ద్వారా పౌరుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, డిజిటల్ ఫైళ్ల పరిశీలనను మంత్రి నిరంతరం కొనసాగించారు. విమానయాన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, ప్రయాణికుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించటానికి 10.12.2025న ప్రయాణికుల సహాయ కంట్రోల్ రూమ్‌ను కూడా శ్రీ రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. దీని ద్వారా "ప్రయాణికులకు మొదటి ప్రాధాన్యత" అనే పాలనా విధానానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.

నవంబర్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2026 వరకు జరిగిన పెండింగ్ విషయాల పరిష్కార ప్రత్యేక క్యాంపెయిన్ (ఎస్‌సీడీపీఎం) 5.0లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్సాహంగా పాల్గొంది.

సాధించిన గణనీయమైన పురోగతి

  • మొత్తం భౌతికంగా 6,803 ఫైళ్లు, 1,316 -ఫైళ్లను పరిశీలించారు. వీటిలో 570 -ఫైళ్లను విజయవంతంగా పరిష్కరించి, మూసివేశారు.

  • భౌతికంగా మొత్తం 1,628 ఫైళ్లను విజయవంతంగా తొలగించారు.

  • మొత్తం 1,166 స్వచ్ఛతా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

  • పాత సామాగ్రి, -వ్యర్థాలు, నిరుపయోగమైన ఫైళ్ల తొలగింపు ద్వారా సుమారు 18,308 చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఖాళీ అయింది.

  • పాత సామాగ్రి విక్రయం ద్వారా రూ. 41,20,582 ఆదాయం సమకూరింది.

ఈ సమయంలో 7,250కి పైగా ప్రజా ఫిర్యాదులు, 2,100 ఫిర్యాదు అప్పీళ్లు విజయవంతంగా పరిష్కారమయ్యాయి. తద్వారా దాదాపు 99 శాతం ఫిర్యాదుల పరిష్కార రేటు నమోదైంది.

ఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న అంతర్-మంత్రిత్వ శాఖ ఉత్తర ప్రత్యుత్తరాలను అధికారులు వేగంగా పరిష్కరించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఏకంగా 41 ఎంపీ సూచనలు, 20 పీఎంఓ సూచనలు, 3 ఐఎంసీ సూచనలు, 14 రాష్ట్ర ప్రభుత్వ సూచనలను పరిష్కరించింది.

ప్రయాణికులు కేంద్రంగా ఉండటమే ప్రధాన ధ్యేయంగా... సానుకూలంగా, స్పందించే, గందరగోళంగా లేని కార్యాలయ వాతావరణాన్ని పెంపొందించేందుకు అచంచలమైన నిబద్ధతను మంత్రిత్వ శాఖ కొనసాగిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2311366) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी