వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-మెర్కోసూర్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం విస్తరణకు ప్రారంభమైన చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 5:57PM by PIB Hyderabad
భారత్-మెర్కోసూర్ మధ్య ప్రాధాన్య వాణిజ్య ఒప్పంద విస్తరణకు చర్చలను ప్రారంభిస్తున్నట్లు మెర్కోసూర్ తాత్కాలిక అధ్యక్ష హోదాలో ఉన్న ఉరుగ్వే విదేశాంగ మంత్రి మారియో లుబెట్కిన్, భారతదేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు.
ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటంతో పాటు ఇరుదేశాల ప్రైవేట్ రంగానికి మెరుగైన ప్రయోజనాలను, అవకాశాలను కల్పించేలా పరస్పర ఆసక్తి గల అంశాలను ఈ ఒప్పందంలో చేర్చేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి.
భవిష్యత్తులో విస్తరించనున్న ఒప్పందం పరిధి, రూపరేఖలను నిర్దేశించే మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో భారత్-మెర్కోసూర్ నిమగ్నమై ఉన్నాయి.
(రిలీజ్ ఐడి: 2310503)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5