సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియా పోస్ట్‌‌ను సరికొత్తగా తీర్చిదిద్దినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించిన పోస్టల్ ఉద్యోగ సంఘాలు

ఆధునిక, పౌర-కేంద్రీకృత నెట్‌వర్క్‌గా మార్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయా సంఘాలు ప్రతినిధులు

డాక్టర్ జితేంద్ర సింగ్‌తో భేటీ అయిన పోస్టల్ ఉద్యోగ సంఘాలు.. ఇండియా పోస్ట్ సేవలు, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ విస్తరణపై చర్చ

చివరి మైలు వరకు ప్రజా సేవలను అందించడంలో ఇండియా పోస్ట్‌కు ఉన్న దేశవ్యాప్త నెట్‌వర్క్ కీలకమన్న డాక్టర్ జితేంద్ర సింగ్

విస్తరిస్తున్న ఇండియా పోస్ట్ నెట్‌వర్క్ ప్రభుత్వం-పౌరుల మధ్య అనుసంధానాన్ని మరింత బలపరుస్తుందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 4:54PM by PIB Hyderabad

ఇండియా పోస్ట్ నెట్‌వర్క్‌ను ఆధునికపౌర-కేంద్రీకృత సేవా వ్యవస్థగా తీర్చిదిద్దినందుకు అఖిల భారత పోస్టల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశంసించారుసంప్రదాయ మెయిల్ డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా వేగవంతమైన డెలివరీ సేవలుఆధార్ సేవలుపాన్ కార్డుపాస్‌పోర్ట్ సేవా సౌకర్యాలుడోర్‌స్టెప్ బ్యాంకింగ్డిజిటల్ పింఛను వంటి అనేక రకాల పౌర-కేంద్రీకృత సేవలను దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారుఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా పెంచాయని వారు పేర్కొన్నారు.

ఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో అఖిల భారత పోస్టల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖభూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యతసహాయ మంత్రి.. ప్రధాని కార్యాలయంసిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లుఅణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారుపోస్టల్ సేవల పరివర్తనతో పాటు ఉద్యోగులుఉద్యోగ సంఘాలుపింఛనుదారులకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

 

గడిచిన దశాబ్ద కాలంలో అందించే సేవల విషయంలో ఇండియా పోస్ట్ పోర్ట్‌ఫోలియో ఏ విధంగా పెరిగిందో ఆయా ప్రతినిధులు వివరించారుఅందుబాటులోకి తెచ్చిన సేవల విషయంలో 24 గంటల్లోపు డెలివరీఆధార్ సంబంధిత సేవలుపోస్టల్ నెట్‌వర్క్ ద్వారా పాన్పాస్‌పోర్ట్ సేవలను అందించటం గురించి వారు ప్రస్తావించారుముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దే బ్యాంకింగ్ఆర్థిక సేవలను అందించడంలో పెరుగుతున్న ఇండియా పోస్ట్ పాత్రను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మారుతున్న పోస్ట్‌ మ్యాన్ విధుల్లో ఇండియా పోస్ట్ పరివర్తన స్పష్టంగా కనిపిస్తోందని అన్నారుపోస్ట్ మ్యాన్ నేడు బ్యాంకింగ్ఇతర అవసరమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేర్చటానికే ఎక్కువగా పని చేస్తున్నారని ఆయన తెలిపారుసంప్రదాయ లేఖల డెలివరీ నుంచి ఆర్థికపౌర సేవలను అందించే ఒక విస్తృత వేదికగా పోస్టల్ నెట్‌వర్క్ మారిందిదీనికి ఉన్న విస్తృతమైన పరిధి ప్రభుత్వ సేవలకుప్రజలకు మధ్య ఒక ముఖ్యమైన చివరి మైలు అనుసంధానాన్ని అందిస్తోంది.

 

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్డోర్‌స్టెప్ బ్యాంకింగ్ విస్తరణ ద్వారా పోస్టల్ నెట్‌వర్క్ గ్రామాలుగృహాలకు ఆర్థిక సేవలను తీసుకెళ్లగలిగిందని.. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లకు సమీపంలోనే బ్యాంకింగ్ సౌకర్యాలను పొందగలుగుతున్నారని మంత్రి తెలిపారుపింఛనుదారుల విషయంలో డిజిటల్ లైఫ్ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలను కూడా అందిస్తోన్న పోస్టల్ నెట్‌వర్క్… అవసరమైన పింఛను సంబంధిత సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా ఈ విషయంలో సౌకర్యాన్ని పెంచింది.

 

కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్నప్పటికీ అవసరమైన సేవలను పోస్టల్ నెట్‌వర్క్ నిరంతరం అందించిందన్న డాక్టర్ జితేంద్ర సింగ్.. ఈ విషయంలో ఉద్యోగులు పోషించిన ముఖ్యమైన పాత్రను గుర్తుచేశారుపోస్టల్ సిబ్బంది ప్రజల ఇళ్లకు నేరుగా బ్యాంకింగ్ సేవలునగదును అందించడంలో సహాయపడ్డారుదీనితో పాటు అవసరమైన వైద్యఆరోగ్య సంరక్షణ సామాగ్రిని రవాణా చేయడానికి పోస్టల్ వాహనాలుమౌలిక సదుపాయాలు కూడా ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు.

 

పోస్టల్ శాఖకు ఉన్న విస్తారమైన దేశవ్యాప్త నెట్‌వర్క్ ప్రజా సేవల విషయంలో ఒక విలువైన సంపద అని.. ప్రభుత్వ కార్యక్రమాలుప్రజా అవగాహనచివరి మైలు డెలివరీ కోసం దీనిని మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుప్రభుత్వ కార్యక్రమాలుప్రజలకు సేవలను అందించటం కోసం పోస్టల్ నెట్‌వర్క్‌ను మరింత ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రతినిధి బృందం తెలియజేసింది.

 

ఉద్యోగ సంఘాల గుర్తింపుధ్రువీకరణకు సంబంధించిన అంశాలుశాఖాపరమైన వేదికలలో ప్రాతినిధ్యంపింఛనుదారులుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ విషయాలతో సహా పోస్టల్ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్సంస్థాగత విషయాలను ప్రతినిధి బృందం డాక్టర్ జితేంద్ర సింగ్ ముందుంచింది.

 

కొన్ని విభాగాల ఉద్యోగులుసర్వీస్ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రతినిధి బృందం లేవనెత్తిందివర్తించే నిబంధనలతో పాటు చట్టపరమైనఆర్థికపరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలన అవసరమైన అంశాలపై తగిన అధికారిక ప్రక్రియ ద్వారా పనిచేయనున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా పౌర-కేంద్రీకృత సేవలను అందించటాన్ని మరింత బలోపేతం చేయడంప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా దాని విస్తారమైన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరంపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారించారు.

 

సమావేశం నిర్వహించినందుకుతమ సర్వీస్ విషయాలుసమస్యలను నేరుగా తెలియజేయడానికి అవకాశం కల్పించినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్‌కు ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది.

 

***


(రిలీజ్ ఐడి: 2310241) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी