ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 11:59PM by PIB Hyderabad
శ్రీ గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
శతాబ్దాలుగా మానవాళికి నిస్వార్థ సేవ, మానవ గౌరవం, ఐక్యతా మార్గాన్ని గురు గ్రంథ సాహిబ్ చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
సమాజంలో ఈ విలువలను మరింత పెంపొందించేలా, మరింత కరుణ, సామరస్యం నిండిన ప్రపంచాన్ని నిర్మించేలా ఈ పవిత్ర సందర్భం అందరికీ స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘శ్రీ గురు గ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా శుభాకాంక్షలు.
ఇది శతాబ్దాలుగా నిస్వార్థ సేవ, మానవ గౌరవం, ఐక్యతా మార్గాన్ని మానవాళికి చూపిస్తోంది.
మన సమాజంలో ఈ విలువలను మరింత పెంపొందించి, సామరస్యంతో నిండిన ప్రపంచాన్ని నిర్మించేలా మనందరికీ ఈ పవిత్ర సందర్భం స్ఫూర్తినిచ్చుగాక!’’
(రిలీజ్ ఐడి: 2309905)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4