ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
13 SEP 2026 4:38PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ జూనియర్‌తో సమావేశమయ్యారు. ‘ఆసియాన్’ కూటమి అధ్యక్ష హోదాలో ఫిలిప్పీన్స్ ప్రస్తుత బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
భారత్-ఫిలిప్పీన్స్ మధ్య అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకార విస్తృతిపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, రైల్వే మౌలిక సదుపాయాలు, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు మార్కోస్ 2025 ఆగస్టులో భారత్ సందర్శించినపుడు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదిరింది. దీని ప్రాతిపదికన ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని నాయకులిద్దరూ నిశ్చయించారు. ఈ నేపథ్యంలో విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమిలో సభ్యత్వ స్వీకరణపై ఫిలిప్పీన్స్ నిర్ణయాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.
ప్రస్తుత సమావేశంలో భాగంగా పరస్పర ఆసక్తి గల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రెండు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యంలోని రంగాలన్నిటా సహకార బలోపేతంపై నిబద్ధతను పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2309897)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam