ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండు చిరుత చర్మాలు, సజీవంగా ఉన్న 180 నక్షత్ర తాబేళ్లు, 12 టోకే బల్లులు,

24 కిలోల పాంగోలిన్ పొలుసులు, 500 గ్రాముల పులి ఎముకలను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ

వన్యప్రాణుల అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా చేపట్టిన ఆరు వేర్వేరు దాడుల్లో 13 మంది అరెస్టు

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 9:44PM by PIB Hyderabad

వన్యప్రాణుల అక్రమ రవాణాపై నిఘా పెట్టిన డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)... దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గడచిన 10 రోజుల్లో ఆరు కీలక దాడులను చేపట్టిందిఈ దాడుల్లో రెండు చిరుతపులి చర్మాలుసజీవంగా ఉన్న 180 భారతదేశ నక్షత్ర తాబేళ్లుసజీవంగా ఉన్న 12 టోకే బల్లులుసుమారు 24 కిలోల పాంగోలిన్ పొలుసులు, 500 గ్రాముల పులి ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారుఈ ఆరు దాడుల్లో మొత్తం పదమూడు మందిని అరెస్టు చేశారు.

 

నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన దాడుల్లో భాగంగా 07.09.2026న ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా జేపోరేలో ఒక వ్యక్తిని అడ్డగించిచిరుత చర్మాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారువన్యప్రాణి (సంరక్షణచట్టం-1972లోని ఒకటో షెడ్యూల్‌ ద్వారా చిరుత పులులకు రక్షణ ఉందివీటి చర్మాలుశరీర భాగాల వంటి వాటిని వాణిజ్యంఅమ్మకంకొనుగోలుహస్తగతం చేసుకోవటంరవాణా చేయటం చట్టరీత్యా నిషేధంఈ చట్టం ప్రకారం చిరుత పులి చర్మాన్నిపట్టుబడిన వ్యక్తిని తదుపరి దర్యాప్తు కోసంచట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోరాపుట్ అటవీ శాఖకు అప్పగించారు.

 

 

అదే రోజున జరిగిన మరో తనిఖీలో భాగంగా బెంగళూరులోని గాంధీనగర్‌ సమీపంలో ఓ వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అడ్డగించారుఅతని వద్ద ఉన్న సామాగ్రిని తనిఖీ చేయగా ఆరు సంచుల్లో సజీవంగా ఉన్న 180 భారతదేశ నక్షత్ర తాబేళ్లను గుర్తించారుఈ జాతిని వన్యప్రాణి (సంరక్షణచట్టం-1972లోని ఒకటో షెడ్యూల్‌ జాబితాలో ఉన్న జియోకెలోన్‌ ఎలిగన్స్‌గా వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో (డబ‌్ల్యూసీసీబీగుర్తించిందిభారతదేశ నక్షత్ర తాబేళ్ల పెంకుపై ఉండే ఆకర్షణీయమైన నక్షత్రంఅరుదైన పెంపుడు జీవి కావడం, వన్యప్రాణుల మార్కెట్లలో డిమాండు ఉండటం వల్ల అంతర్జాతీయంగా వీటి అక్రమ రవాణాకు అవకాశం ఉంటుందిఈ చట్టం ద్వారా సజీవంగా ఉన్న 180 తాబేళ్లను స్వాధీనం చేసుకునినిందితుడిని అరెస్టు చేశారు.

 

 

07.09.2026న జరిగిన మూడో దాడిలో భాగంగా మేఘాలయలోని రి-భోయ్ జిల్లాలో మవ్‌హతి వైపు వెళ్తున్న బొలెరో ట్రక్కును అడ్డగించిన డీఆర్‌ఐ అధికారులు... తనిఖీలు నిర్వహించారువాహనంలోని మూడు బ్యాగుల్లో 14.68 కిలోల పాంగోలిన్ పొలుసులను గుర్తించారువన్యప్రాణి (సంరక్షణచట్టం-1972లోని ఒకటో షెడ్యూల్‌లో పాంగోలిన్‌లు రక్షిత జాబితాలో ఉన్నాయిసైట్స్ అపెండిక్స్-I జాబితాలోనూ ఉన్నాయిఆసియాలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయ వైద్యంలో పాంగోలిన్ పొలుసులను ఉపయోగిస్తారుప్రపంచంలోనే అత్యధికంగా అక్రమ రవాణా జరుగుతున్న క్షీరదాల్లో పాంగోలిన్లు ఉన్నాయితదుపరి చట్టపరమైన చర్యల కోసం స్వాధీనం చేసుకున్న పొలుసులుపట్టుబడిన వ్యక్తిరవాణాకు ఉపయోగించిన వాహనాన్ని మేఘాలయలోని నొంగ్‌పోహ్ అటవీ రేంజ్ అధికారికి డీఆర్‌ఐ అప్పగించింది.

 

 

అంతకుముందు 2026 సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో చిరుత చర్మాన్ని అక్రమంగా రవాణా చేసే వ్యవస్థే లక్ష్యంగా మధ్యప్రదేశ్‌లోని సిద్ధి అటవీశాఖ అధికారులతో కలిసి డీఆర్‌ఐ అధికారులుసిద్ధి జిల్లాలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకన్నారుమహీంద్రా థార్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరి వద్ద నుంచి ఒక చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారుతదుపరి దర్యాప్తులుతనిఖీల ద్వారా ఈ సిండికేట్‌కు చెందిన మరో ఇద్దరిని గుర్తించారువారి నుంచి చిరుత చర్మంఅవయవాల అక్రమ వేటస్వాధీనంరవాణావిక్రయానికి సంబంధించిన పలు ఆధారాలను సేకరించారుచిరుత చర్మాన్నివాహనాన్ని స్వాధీనం చేసుకుని... వన్యప్రాణి (సంరక్షణచట్టం-1972 ద్వారా తదుపరి చర్యల నిమిత్తం పట్టుబడిన వ్యక్తులను సిద్ధి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

 

వన్యప్రాణుల అక్రమ వాణిజ్యంపై అందిన కచ్చితమైన సమాచారం మేరకు 05.09.2026న అస్సాంలోని కేయోఖాలిలో ఇద్దరు వ్యక్తుల వద్ద సజీవంగా ఉన్న 12 టోకే బల్లులను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారువన్యప్రాణి (సంరక్షణచట్టం-1972లోని ఒకటో షెడ్యూల్సైట్స్ అపెండిక్స్-II జాబితాలో ఈ టోకే బల్లులను చేర్చారుఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని సంప్రదాయ వైద్యం కోసంశుష్క రూపంలోనూ వాడటం వల్ల అక్రమ రవాణాకు అవకాశం ఏర్పడింది. అరుదైన పెంపుడు జీవిగా కూడా వీటికి డిమాండ్ ఉందిసజీవంగా ఉన్న బల్లులను స్వాధీనం చేసుకునిఅక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులనువన్యప్రాణి వస్తువులతో సహా అస్సాంలోని బిశ్వనాథ్ వన్యప్రాణి విభాగం అటవీ రేంజ్ అధికారికి అప్పగించారు.

 

కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో 28.08.2026న వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులను డీఆర్‌ఐ అధికారులు అడ్డుకున్నారువారి నుంచి దాదాపు కిలోల పాంగోలిన్ పొలుసులుపుర్రెపళ్లతో సుమారు 0.5 కేజీ పులి ఎముకలను స్వాధీనం చేసుకున్నారువన్యప్రాణి (సంరక్షణచట్టం-1972 ద్వారా స్వాధీనం చేసుకున్న వన్యప్రాణుల వస్తువులతో సహా వాహనాన్నిముగ్గురు వ్యక్తులను అస్సాంలోని బొకొలియా అటవీ రేంజ్ అధికారికి అప్పగించారు.

అంతరించిపోతున్న వన్యప్రాణుల నుంచి జంతువుల చర్మాలుపాంగోలిన్ పొలుసులుపులి అవయవాల వరకు వివిధ రకాల వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్వాధీనం చేసుకున్న వాటి ద్వారా తెలుస్తోందిదీన్ని బట్టి నిరంతరం అంతర్గత ఏజెన్సీల సమన్వయం అవసరమని స్పష్టం అవుతోంది.

అటవీ శాఖలుడబ్ల్యూసీసీబీఇతర చట్ట అమలు సంస్థల సహకారంతోవన్యప్రాణి (సంరక్షణచట్టం-1972 ద్వారానిఘా వర్గాల సమాచారం ఆధారంగా వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యవస్థను డీఆర్‌ఐ విజయవంతంగా అడ్డుకుంటూ భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2308656) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी